Detox Drinks for Skin : చలికాలంలో ఈ డీటాక్స్ డ్రింక్స్ తాగితే.. స్కిన్ సహజంగా మెరిసిపోతుందట, డల్‌గా కనిపించదు
ఉదయం లేచి గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే చర్మానికి మేలు జరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. కణాల పెరుగుదలకు సహాయపడుతుంది. తేనెలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు రంధ్రాలను శుభ్రపరుస్తాయి. మొటిమల నుంచి రక్షిస్తాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅలోవెరా జ్యూస్‌లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది చర్మాన్ని నయం చేయడంలో సహాయం చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ బి, సి చర్మాన్ని హైడ్రేట్‌గా, మృదువుగా చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం దీన్ని తాగడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.
శీతాకాలంలో క్యారెట్, బీట్రూట్ జ్యూస్ చర్మానికి అత్యంత శక్తివంతమైన పానీయంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. అయితే ఐరన్ చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. ఇది చర్మంపై నల్ల మచ్చలు, మొటిమల సమస్యను కూడా తగ్గిస్తుంది.
పాలకూర జ్యూస్‌లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. చర్మానికి సహజమైన, శుభ్రమైన రూపాన్ని ఇస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, ఇ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. వాపును తగ్గిస్తాయి. వృద్ధాప్య సంకేతాలు కూడా తగ్గుతాయి.
చియా సీడ్ వాటర్ మార్నింగ్ డిటాక్స్ డ్రింక్‌గా చాలా ప్రసిద్ధి చెందింది. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, సిరామైడ్స్, యాంటీఆక్సిడెంట్స్ చర్మాన్ని హైడ్రేట్‌గా, మృధువుగా చేస్తాయి. ఇది ముడతలు రాకుండా కాపాడి.. యూవీ డ్యామేజ్ నుంచి రక్షణను ఇస్తుంది.
కాబట్టి చలికాలంలో చర్మాన్ని కాపాడుకునేందుకు మీరు ఈ డిటాక్స్ డ్రింక్లను ప్రతిరోజూ ఉదయం దినచర్యలో చేర్చుకోవచ్చు. ఈ డ్రింక్లను రెగ్యులర్‌గా తీసుకుంటే మీ చర్మం ఆరోగ్యంగా, సహజంగా మెరుస్తూ అందంగా కనిపిస్తుంది.