Cancer Deaths : క్యాన్సర్ మరణాలు ఏ దేశంలో ఎక్కువగా ఉన్నాయో తెలుసా? ఇండియా ఏ ప్లేస్‌లో ఉందంటే
క్యాన్సర్ రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఒక్కసారి వచ్చిందంటే ఇది శరీరంలోని అన్ని కణాలను ఎఫెక్ట్ చేసి ప్రాణాల మీదకు తెస్తుంది.
క్యాన్సర్‌లో మొత్తం నాలుగు దశలు ఉంటాయి. చివరి దశ ప్రాణాంతకం. ధూమపానం, మద్యం సేవించడం, ఫ్యామిలీ హిస్టరీ, అన్ హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ వంటి కారణాలు క్యాన్సర్‌కు దారితీస్తాయి.
క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే చికిత్సతో దానిని క్యూర్ చేసుకోవచ్చు. కీమో థెరపీతో ప్రధానంగా చికిత్స చేస్తారు. అయితే చికిత్స ఉన్నా కూడా క్యాన్సర్ మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. మరి ఏ దేశంలో క్యాన్సర్ వల్ల ఎక్కువమంది మరణిస్తున్నారో తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అత్యధిక క్యాన్సర్ మరణాలు చైనాలోనే జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం దాదాపు 48 లక్షలకు పైగా క్యాన్సర్ కేసులు చైనాలో నమోదవుతున్నాయి.
అమెరికాలో కూడా క్యాన్సర్ బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం 23 లక్షల మందికి క్యాన్సర్ వస్తున్నట్లు సర్వేలు తెలిపాయి.
ఈ జాబితాలో ఇండియా మూడు స్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం 10 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి.
క్యాన్సర్‌పై సరైనా అవగాహన లేకపోవడం.. చికిత్స ఉందని తెలియకపోవడం.. చికిత్సకు అయ్యే ఖర్చు భరించలేకపోవడం వల్ల చాలామంది క్యాన్సర్ బాధితులు మృత్యువాత పడుతున్నారు.