Asthma Risk Factors : ఆస్తమా త్వరగా ఎవరికి వస్తుందో తెలుసా? తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
ఆస్తమా ఉన్నవారికి ఉబ్బసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంది. గురక వస్తుంది. ఛాతీలో బిగుతుగా ఉంటుంది. తీవ్రమైన దగ్గుకు దారితీస్తుంది. ఈ లక్షణాలు ఆస్తమాలో భాగమే.
అయితే ఆస్తమా ఎవరికైనా రావొచ్చు. ఆస్తమా ఎవరిని త్వరగా ఎటాక్ చేస్తుందో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్యామిలీలో ఎవరికైనా ఇప్పటికే ఆస్తమా ఉంటే.. మీకు కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలెర్జీలతో ఇబ్బంది పడేవారు, ఉబ్బసంతో ఇబ్బంది పడేవారికి కూడా ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువ.
అధిక బరువు ఉన్నవారికి కూడా ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ. ధూమపానం చేసేవారికి ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఆస్తమా ట్రిగర్ చేసే అంశాలకు దూరంగా ఉండాలి. శుభ్రంగా ఉండే ప్రదేశాల్లో ఉండాలి. డస్ట్ ఉండే ప్రదేశాలకు వెళ్లేప్పుడు మాస్క్ అయినా పెట్టుకుంటే మంచిది.
స్మోక్ మానేస్తే మంచిది. బరువు కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఒత్తిడిని దూరం చేసి టిప్స్ ఫాలో అవుతూ.. హైజీన్గా ఉంటే మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.