No Hair Oil for 30 Days : జుట్టుకు నెల రోజులు నూనె రాయకపోతే ఏమవుతుంది? హెయిర్ ఎక్కువ రాలిపోతుందా?
జుట్టుకు నూనె రాయడం మానేస్తే ఏమవుతుంది? నెల పాటు తలకు నూనె రాయకుండా ఉంటే మొదట్లో ఏమీ అనిపించకపోవచ్చు. జుట్టు జిడ్డుగా ఉండదు. తేలికగా అనిపిస్తుంది. నార్మల్ ఉండవచ్చు.
కానీ వారాలు గడిచేకొద్దీ మార్పులు నెమ్మదిగా మొదలవుతాయి. జుట్టు చివర్లలో పొడిబారడం, చిక్కులు పెరగడం, చర్మం కొద్దిగా బిగుతుగా అనిపించవచ్చు. మొదట కనిపించే మెరుపు తగ్గుతుంది. మృదుత్వం కూడా మునుపటిలా ఉండదు.
నిజానికి నూనె జుట్టును రక్షిస్తుంది. ధూళి, సూర్యరశ్మి, వేడి, నీటి వల్ల కలిగే హానికరమైన ప్రభావాల నుంచి జుట్టుకు రక్షణ అందుతుంది. ఈ పొర తొలగిపోతే జుట్టుపై మురికి పేరుకుపోతుంది. అలాగే హెయిర్ వాష్ చేయడం కూడా కష్టం అవుతుంది. దువ్వెన ఉన్నా.. పొడిబారిన జుట్టువల్ల దువ్వడం ఇబ్బందులకు గురి చేస్తుంది.
మీరు నూనె మర్దన ఒక రకమైన మానసిక ఉపశమనం ఇస్తుందని భావించే వారిలో ఒకరైతే.. దాని లోపం మీ మానసిక స్థితిపై కూడా కనిపిస్తుంది. మర్దన ద్వారా లభించే వెచ్చదనం, సడలింపు తరచుగా ఒత్తిడిని తగ్గిస్తాయి. నూనె పెట్టకపోతే ఒత్తిడి తగ్గదు.
అయితే ఈ మార్పులు అందరికీ తెలియకపోవచ్చు. మీ జుట్టు సహజంగా నూనెగా ఉంటే.. తేమతో కూడిన వాతావరణంలో రెగ్యులర్గా లీవ్-ఇన్ కండీషనర్, హెయిర్ మాస్క్లను ఉపయోగించవచ్చు. ఎవరికైతే నూనె ప్రధాన హైడ్రేషన్ వనరుగా ఉందో.. వారి జుట్టు చలికాలంలో లేదా పొడి వాతావరణంలో త్వరగా పాడైపోతుంది.
రోజూ నూనె రాయడం కూడా అవసరం లేదని.. కానీ పూర్తిగా వదిలేయడం కూడా సరికాదని తెలిపారు. కావాలంటే తేలికపాటి నూనెలు వాడితే మంచిది. లేదా వారానికి ఒకటి లేదా రెండుసార్లు రాసి చూడండి.