Monsoon Vegetables to Avoid : వర్షాకాలంలో తినకూడని కూరగాయలు ఇవే.. తింటే ఆరోగ్యానికి కలిగే నష్టాలివే
వర్షాకాలంలో పాలకూర, మెంతి కూర వంటి ఆకుకూరలపై పురుగులు, బాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతాయి. వీటిని తినడం వల్ల కడుపు ఇన్ఫెక్షన్, అతిసార సమస్యలు రావచ్చు.
కాలీఫ్లవర్ వర్షాకాలంలో పురుగులు పట్టే అవకాశం ఉంది. త్వరగా కుళ్లిపోతుంది. ఇందులో బ్యాక్టీరియా దాగి ఉండవచ్చు. ఇది తిన్నప్పుడు కడుపు నొప్పి, ఫుడ్ పాయిజనింగ్కు కారణం కావచ్చు.
వర్షాకాలంలో వంకాయలు త్వరగా పాడవుతాయి. వాటిలో తేమ ఉండటం వల్ల ఫంగస్, పురుగులు ఏర్పడతాయి. దీనివల్ల చర్మ అలర్జీలు, కడుపు సమస్యలు వస్తాయి.
బెండకాయలో సహజంగానే జిగట ఉంటుంది. కానీ వర్షాకాలంలో ఇది మరింత పెరుగుతుంది. ఇది తినడం వల్ల జీర్ణ సమస్యలు, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు ఉంటాయి.
వర్షాకాలంలో చామదుంపలు త్వరగా కుళ్లిపోతాయి. జీర్ణం చేసుకోవడం కూడా కష్టం అవుతుంది. ఈ సీజన్లో అరబీ తినడం వల్ల గ్యాస్, కడుపు నొప్పి, అసిడిటీ పెరిగే అవకాశం ఉంది.
వర్షాకాలంలో టమాటాలు త్వరగా కుళ్లిపోతాయి. పాడైపోతాయి. కుళ్లిన టమాటాలు ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. ఆహార ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి.
కాబట్టి వర్షాకాలంలో తాజాగా లభించే కూరగాయలను మాత్రమే తినడానికి ప్రయత్నించండి. కూరగాయలను బాగా కడిగి.. ఉడికించి తినండి.