Business Ideas for Women : మహిళలు చేయగలిగే బెస్ట్ బిజినెస్ ఐడియాలు ఇవే.. కొన్ని నెలల్లోనే పెట్టుబడి వచ్చేస్తుంది
మీకు వంట చేయడం ఇష్టమైతే.. టిఫిన్ సర్వీస్ మంచి స్టార్టప్ అవుతుంది. పరిశుభ్రమైన వంటగది.. కొన్ని పాత్రలు, రుచిగా చేస్తే సరిపోతుంది. ఆఫీసుకు వెళ్లేవారికి, విద్యార్థులకు హెల్తీ ఫుడ్ ఇంట్లోనే తయారుచేసి ఇవ్వవచ్చు. ఫుడ్‌కి ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. టేస్టీగా, క్లీన్‌గా ఉంటే నెలరోజుల్లోనే మీరు మంచి రాబడి పొందుతారు.
మహిళలు డిజైనింగ్‌లో క్రియేటివ్‌గా ఆలోచిస్తారు. మీకు దానిమీద ఇంట్రెస్ట్ ఉంటే.. కుట్టుపని ట్రై చేయడంతో పాటు బొటిక్ స్టార్ట్ చేయవచ్చు. ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్స్ ద్వారా కూడా ఆర్డర్లు పొందవచ్చు. 10-15 వేల రూపాయల పెట్టుబడితో దీనిని ప్రారంభించవచ్చు. కొన్ని నెలల్లోనే మంచి లాభాలు వస్తాయి.
బ్యూటీకి సంబంధించిన వ్యాపారానికి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ఇంట్లోనే ఏదైనా భాగాన్ని చిన్న సెలూన్‌గా మార్చుకోవచ్చు. మేకప్, హెయిర్ కట్, ఫేషియల్ వంటివాటి ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. తక్కువ సమయంలో ఖర్చు తిరిగి వస్తుంది.
బేకింగ్ వస్తే ఈ వ్యాపారం చాలా వేగంగా పెరుగుతుంది. పుట్టినరోజులు, వార్షికోత్సవాలు లేదా చిన్న ఫంక్షన్ల కోసం ఇంట్లో తయారుచేసిన తాజాగా చేసిన కేక్ డెలీవరి చేయవచ్చు. 20 వేల లోపు పెట్టుబడి పెడితే.. సంపాదన 40-50 వేల వరకు పొందవచ్చు.
ఒక పనిమీద మీకు మంచి అవగాహన, సమాచారం ఉంటే.. వంట, కళ, ఫ్యాషన్ లేదా విద్య ఇలా ఏదైనా టాలెంట్ ఉంటే.. యూట్యూబ్ ఛానెల్ లేదా ఆన్లైన్ క్లాస్ ప్రారంభించవచ్చు. ప్రారంభ నెలల్లో సంపాదన తక్కువగా ఉంటుంది. కానీ ఒకసారి వ్యూస్ ప్రారంభమైతే ఆదాయం నిరంతరం పెరుగుతుంది. ఇందులో ఎక్కువ పెట్టుబడి కూడా ఉండదు.
ఫ్యాషన్ ఉపకరణాల ట్రెండ్ ఎల్లప్పుడూ ఉంటుంది. మహిళలు కోరుకుంటే చేతితో చేసిన ఆభరణాలు తయారు చేసి సోషల్ మీడియా ద్వారా అమ్మవచ్చు. కొన్ని వేల రూపాయలతో ప్రారంభించవచ్చు. లాభాల మార్జిన్ 40-50% వరకు ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది ఈ పనిపై ఆసక్తి చూపుతున్నారు.