Toothbrush Replacement : టూత్ బ్రష్‌ను ఎన్ని రోజులకు మార్చాలి.. లేకుంటే ఏమవుతుంది?
ప్రతిరోజూ పళ్లు తోముకోవడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. బ్రషింగ్ వల్ల పళ్లపై ఉండే పాచి తొలగుతుంది. బ్యాక్టీరియాను తొలగించి నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
దంతక్షయం, చిగుళ్ల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. కాబట్టి బ్రష్ చేయడంలో ఎలాంటి మిస్టేక్‌లు చేయవద్దని చెప్తున్నారు నిపుణులు.
దాదాపు చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే.. ఒకే టూత్ బ్రష్‌ను ఎక్కువ కాలం ఉపయోగిస్తారు. ఇది అస్సలు మంచి పద్ధతి కాదని చెప్తున్నారు.
ఎక్కువరోజులు ఒకే బ్రష్ ఉపయోగించడం వల్ల దంతాలు, చిగుళ్లపై చెడు ప్రభావం చూపిస్తుంది. అందుకే టూత్ బ్రష్‌ను మార్చాలంటున్నారు. మరి దీనిని ఎన్ని రోజులకు మార్చాలంటే..
టూత్ బ్రష్‌ను ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు ఓసారి మార్చాలని సూచిస్తున్నారు నిపుణులు. బ్రిజెల్స్ అరిగిపోతే కూడా వెంటనే మార్చుకోవాలంటున్నారు.
అనారోగ్యంతో ఉన్నప్పుడు, తగ్గిన తర్వాత కూడా టూత్ బ్రష్‌ను మార్చాలని సూచిస్తున్నారు. వేరొకరితో కూడా బ్రష్‌లు పంచుకోవద్దని చెప్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.