Kidney Health : కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడే ఫుడ్స్ ఇవే.. డీటాక్స్ చేయడంలో మంచి ఫలితాలుంటాయట
కిడ్నీలు ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇవి శరీరంలోని టాక్సిన్లను బయటకి పంపి.. హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. అందుకే వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.
కిడ్నీలను కాపాడుకోవడానికి ఎక్కువగా నీటిని తాగాలి. ఆల్కహాల్‌కి దూరంగా ఉండాలి. అలాగే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఇవి కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి. మరి ఏ ఫుడ్స్ తింటే ఆరోగ్యానికి మంచిదో చూసేద్దాం.
నిమ్మరసం సహజంగా కిడ్నీలను క్లెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. దీనిలోని సిట్రిక్ యాసిడ్ యూరిన్‌లో సిట్రేట్ లెవెల్స్ పెంచుతుంది. ఇది కిడ్నీలో రాళ్లు రాకుండా కాపాడుతుంది.
పుచ్చకాయలు కూడా కిడ్నీల ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి. శరీరంలోని టాక్సిన్లను బయటకి పంపి కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీనిలోని పొటాషియం కిడ్నీ సమస్యలను దూరం చేస్తుంది.
దానిమ్మను జ్యూస్ రూపంలో లేదా నేరుగా తీసుకుంటే కూడా పొటాషియం శరీరానికి అందుతుంది. ఇది కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది. టాక్సన్లను బయటకి పంపడంలో హెల్ప్ చేస్తుంది.
తులసి ఆకులు కూడా కిడ్నీ సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి. కిడ్నీ డ్యామెజ్ తగ్గించి.. రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ కంట్రోల్ చేస్తాయి. కిడ్నీల్లో రాళ్లు బయటకి పంపి మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.