Sleeping with Headphones : నిద్రపోయేప్పుడు మ్యూజిక్ వినే అలవాటు ఉందా? అయితే ఇది మీకోసమే
నిద్రపోయేప్పుడు కాసేపు మ్యూజిక్ వినడం మంచిదే కానీ.. ఎక్కువసేపు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని లేదా ఇయర్ ఫోన్స్‌తో పాటలు వినడం మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు.
సంగీతం మనసుకు హాయిని ఇస్తుంది. మంచి నిద్రను అందిస్తుంది. కానీ ఈ అలవాటు ఎక్కువసేపు కొనసాగితే మంచిది కాదట. దీనివల్ల చెవులు దెబ్బతిని.. ఒత్తిడిని పెంచుతాయట.
రాత్రంతా ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని సంగీతం వింటే అది నిద్రపై ప్రభావం చూపిస్తుంది. ఇది మెదడుపై పూర్తిగా ప్రభావం చూపి విశ్రాంతిని దూరం చేస్తుంది. స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల తర్వాత రోజు అంతా డిస్టర్బ్డ్గా ఉంటారు.
పాటలు వింటూ మెదడు బిజీగా ఉంటే నిద్ర పూర్తి స్థాయిలో ఉండదు. తర్వాత రోజు మీరు ఏ పనిపై ఫోకస్ చేయలేరు. నిద్రమత్తులోనే ఉంటారు.
చిరాకు, ఆందోళన వంటి యాంగ్జైటీ సమస్యలు పెరుగుతాయి. కాబట్టి అతిగా వాడడం మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు.
మీకు మ్యూజిక్ వినాలనుకుంటే లైట్ మ్యూజిక్ పెట్టుకోవాలని.. అది కూడా ఎక్కువసేపు కాకుండా చూసుకోవాలని సూచిస్తారు. లేదంటే మీకు విశ్రాంతికి బదులు చురుకుదనం లభిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.