Tissue Sarees : టిష్యూ శారీల్లో అందంగా, స్టన్నింగ్‌గా కనిపించాలంటే.. ఈ హీరోయిన్లను ఫాలో అయిపోండి
జాన్వీ కపూర్ కట్టుకున్న లేత గులాబీ రంగు టిష్యూ సిల్క్ చీర.. ఫ్యాషన్ ప్రియులను బాగా ఆకర్షించింది. షైన్, లైట్ ఎంబ్రాయిడరీతో నిండిన ఈ చీర బంగారు జరీ అంచుతో వచ్చింది. జాన్వీ ఈ శారీ లుక్ కోసం భారీగా అలంకరించిన బ్లౌజ్, చోకర్ నెక్లెస్ ధరించింది. సాంప్రదాయ లుక్స్‌లో చక్కని లుక్‌తో వింటేజ్ వైబ్‌ను తీసుకొచ్చింది. పండుగలకు, ఈవెనింగ్ పార్టీలకు, వివాహాలకు ఈ లుక్ ట్రై చేయవచ్చు. (చిత్ర మూలం: Instagram/@janhvikapoor)
శోభితా ధూళిపాళ ధరించిన లెమన్ గ్రీన్ శారీ.. ట్రెండ్, ట్రెడీషన్‌ని మిక్స్ చేసింది. ఈ అందమైన శారీని ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్‌తో జతచేసింది. పండుగ సమయాల్లో, ఇతర ఈవెంట్స్‌కు ఇది బెస్ట్ ఆప్షన్. తేలికైగా, ట్రాన్సపరెంట్ లుక్‌తో వచ్చిన ఈ శారీ ఆకట్టుకునే రూపాన్ని ఇస్తుంది. మీరు కూడా ఇలాంటి శారీ కట్టుకుంటే ఈ స్టైల్‌ని ఫాలో అవ్వొచ్చు. (చిత్రం సోర్స్: Instagram/sobhitad)
మెరిసే బంగారు చేనేత టిష్యూ చీరలో రేఖ లుక్‌ని చూస్తే మతి పోవాల్సిందే. ఆమె సిగ్నేచర్ శారీ లుక్‌కి తగ్గట్లు అందంగా ముస్తాబైంది. గోల్డ్ జుంకాలు, గాజులు, వింటేజ్ రింగులు, దానికి సరిపోయేట్టు బ్యాగ్‌తో అందంగా, స్టైల్‌గా ముస్తాబైంది రేఖ. రెడ్ లిప్‌స్టిక్, బొట్టు ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేశాయి. ఈ లుక్‌ని ఏ అకేషన్లో అయినా రీక్రియేట్ చేయవచ్చు. (చిత్ర మూలం: Instagram/manishmalhotra05)
శ్రద్ధా కపూర్ మెరిసే షాంపైన్ గోల్డ్ టిష్యూ చీరలో ఫెస్టివల్ లుక్స్‌ని తీసుకొచ్చింది. సాఫ్ట్ మెటాలిక్ డ్రేప్‌లో శ్రద్ధా అందంగా కనిపించింది. ఈ లుక్‌ని డీప్ నెక్లైన్తో సీక్విన్డ్ బ్లౌజ్‌తో జత చేసింది. చీరకు తోడుగా పొట్లీ బ్యాగ్ వేసుకుని తన లుక్‌ని రెట్టింపు చేసింది. పండుగల సమయంలో మీరు ఈ తరహా లుక్ ట్రై చేయవచ్చు. (చిత్ర మూలం: Instagram/shraddhakapoor)
సోనమ్ కపూర్ ఎంబ్రాయిడరీతో వచ్చిన టిష్యూ చీరలో చాలా ఆకర్షణీయంగా కనిపించింది. తన శారీకి తగ్గట్లు గోల్డ్ జ్యూవెలరీ వేసుకుని తన లుక్‌ని మరింత ట్రెడీషనల్గా కనిపించేలా చీరను కట్టుకుంది. గోల్డ్ నెక్ పీస్, గాజులు, ముడి వేసుకుని చాలా అందంగా కనిపించింది. పండుగలు, పూజలు, ఇంట్లో చేసుకునే వ్రతాలకు ఈ లుక్ అనువైనది. (చిత్ర మూలం: Instagram/@sonamkapoor)
శిల్పా శెట్టి టిష్యూ శారీకి రిచ్ లుక్‌ని జత చేసింది. పండుగ సమయంలో ఈ లుక్ మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. స్టైలిష్ మినిమలిస్ట్ బ్లౌజ్, స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్‌తో శిల్పా తన లుక్‌ని ఫైనల్ చేసింది. (చిత్ర మూలం: Instagram/Shilpa Shetty)