Best Photo Editing Tools : ఫోటోలు ఎడిట్ చేసుకోవడానికి ఈ టూల్స్ బెస్ట్ ఆప్షన్.. ఫ్రీ కూడా
ఫోటోలు ఎడిట్ చేసుకోవడానికి కాన్వా ఓ బెస్ట్ టూల్. ఇది కేవలం ఫోటో ఎడిటింగ్‌కి మాత్రమే కాదు.. గ్రాఫిక్ డిజైన్ కోసం కూడా ఉపయోగించవచ్చు. దీనితో డ్రాగ్-అండ్-డ్రాప్ ఇంటర్ఫేస్, రెడీమేడ్ టెంప్లేట్లు (Instagram నుంచి YouTube థంబ్‌నెయిల్స్) ఈజీగా చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌ను తొలగించే సౌకర్యం కూడా ఉంది. ఇది ప్రాథమిక అవసరాలకు సరిపోతుంది. రీసెంట్గా కంటెంట్‌లోకి వచ్చినవారికి కాన్వా బాగా హెల్ప్ అవుతుంది. దీనితో వారు సోషల్ మీడియాకు అవసరమైన విజువల్స్ చేసుకోవచ్చు.
గూగుల్‌కి చెందిన స్నాప్‌సీడ్ కూడా ఫోటోలు ఎడిట్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా మొబైల్లో ఫోటోలు ఎడిట్ చేసుకోవడానికి ఇది చాలా బెస్ట్ యాప్. ఈ యాప్‌ను ఎలాంటి యాడ్లు లేకుండా, వాటర్‌మార్క్ లేకుండా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అలాగే సెలెక్టివ్ ఎడిటింగ్, హీలింగ్ టూల్స్, కర్వ్ కంట్రోల్ లాంటివి చేసుకోవచ్చు. దీనిలోని టూల్స్‌ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎడిటింగ్ కూడా ఈజీగా ఉంటుంది.
Pixlr ఇంకో మంచి టూల్ బ్రౌజర్. దీనిని మొబైల్లో కూడా ఉపయోగించవచ్చు. లేయర్ ఎడిటింగ్, స్మార్ట్ AI టూల్స్ సహాయంతో ఎలాంటి సైన్-అప్ లేకుండా ఫోటో నుంచి బ్యాక్‌గ్రౌండ్‌ని తీసివేయవచ్చు. ఇదీ ఫోటోషాప్ లాంటి భారీ సాఫ్ట్‌వేర్ లేకుండా లైట్, ఫాస్ట్ ఎడిటింగ్ చేయాలనుకున్న వారికి ఇది బాగా హెల్ప్ అవుతుంది.
మీకు ఫోటోషాప్ వంటి అధునాతన ఎడిటింగ్ కావాలని.. కానీ మీరు ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయకూడదనుకుంటే Photopea బెస్ట్ ఆప్షన్. ఇది ఆన్‌లైన్‌లో PSD, Sketch, RAW వంటి అనేక ఫార్మాట్‌లకు మద్దతు ఇస్తుంది. లేయర్‌లు వేయడం నుంచి మాస్క్‌లు, అధునాతన టూల్స్‌ను అందిస్తుంది. వృత్తిపరమైన ఎడిటింగ్ చేయాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఫోటోర్ ఒక AI ఆధారిత ఫోటో ఎడిటర్. ఇది ఫోటోలను త్వరగా మెరుగుపరుస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే వన్-ట్యాప్‌తో బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. చర్మం మృదువుగా కనిపించేలా చేయడం, HDR ఫిల్టర్లు, సోషల్ మీడియా టెంప్లేట్లు ఈజీగా చేస్తుంది. ఈ యాప్ ప్రారంభ యూజర్లకు, చిన్న క్రియేటర్లు, డిజిటల్ మార్కెటర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది డిజైన్, ఎడిటింగ్‌కు మంచి సమతుల్యతను అందిస్తుంది.
ఈ టూల్స్ అన్ని ఉచితంగానే కాకుండా యూజర్ ఫ్రెండ్లీగా కూడా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ నుంచి డెస్క్ టాప్ వరకు వీటిని ఉపయోగించి ఎవరైనా తమ ఫోటోలను మెరుగుపరచవచ్చు. అది కూడా ఎలాంటి ఖర్చు లేకుండా. భారతదేశంలో విద్యార్థులు, కంటెంట్ క్రియేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, చిన్న వ్యాపారాలు చేసుకునేవారికి ఈ టూల్స్ నిజంగా చాలా ఉపయోగకరంగా ఉంటాయి.