Must do Things in Wife Pregnancy : వైఫ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు భర్త ఇలా చేస్తే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువట
కేవలం మహిళ మాత్రమే కాదు.. ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం భర్త బాధ్యత కూడా. ఈ ఇంపాక్ట్ అనేది.. గర్భంలోని శిశువుపై పడుతుంది. మీరు ఎంత పాజిటివ్‌గా భార్యను ఉంచుతారో.. బేబీ అంత హెల్తీగా మారుతుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకుటుంబ సభ్యులు ఉన్నారుగా చూసుకోవడానికి అనుకున్న.. భార్యకు దగ్గరగా భర్త ఉన్నప్పుడే ఆమెకు రిలీఫ్‌గా ఉంటుంది. ఎక్కువ పనులేమిచేయాల్సిన అవసరం లేదు. మీరు చేసే చిన్న చిన్న పనులు కూడా ఆమెను హ్యాపీగా ఉంచుతాయి.
గర్భంతో ఉన్న మహిళ పడుకునే సమయంలో చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఆమెకు పొజిషన్ కరెక్ట్‌గా ఉందో లేదో.. పిల్లో ఎక్కడ పెడితే.. ఆమెకు కంఫర్ట్‌గా ఉందో తెలుసుకుని.. వాటిని ఫాలో అవ్వొచ్చు. మెరుగైన నిద్ర తల్లి, బిడ్డకు చాలా మేలు చేస్తుంది.
ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వారు కాస్త ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా కాళ్లలో నీరు చేరడం, వాపు రావడం వంటివి జరుగుతాయి. అలాంటి సమయాల్లో కాళ్లకు కాస్త మసాజ్ చేయడంవల్ల వాళ్లు రిలాక్స్ అవుతారు.
వారికి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేయడం కాకుండా.. వారికోసం మీరు ఇంట్లో వండిపెట్చొచ్చు. టేస్టీగా, హెల్తీగా మీ భార్యకు తినిపించవచ్చు. బయటఫుడ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.
ప్రెగ్నెన్సీ సమయంలో వారితో ఉంటూ.. మీరు బేబితో కమ్యూనికేట్ చేస్తే.. తల్లీ, బిడ్డ కూడా హ్యాపీగా ఉంటారు. లేదంటే వాళ్లు లోన్లీ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది.
నచ్చినప్రదేశాలకు తీసుకెళ్లడం, లేదా సాయంత్రం ఇద్దరూ కలిసి వాకింగ్‌కి వెళ్లడం వంటివి చేస్తే డెలివరీ ఫ్రీగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.