Dengue Symptoms in Kids : పిల్లల్లో డెంగ్యూ లక్షణాలు ఇలా గుర్తించాలి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
డెంగ్యూ మొదటిసారి వచ్చినా.. చిన్నపిల్లల్లో వచ్చిన లక్షణాలు కాస్త సాధారణంగానే ఉంటాయి. రెండోసారి వచ్చినప్పుడు తీవ్రమైన లక్షణాలు కలిగి ఉంటాయి. (Images Source : Envato)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపిల్లలు తమ పరిస్థితి చెప్పుకోలేరు కాబట్టి కొన్ని లక్షణాలు చూసి పేరెంట్సే జాగ్రత్తలు తీసుకోవాలి. కామన్‌గా ఉండే డెంగ్యూ లక్షణాలు ఇప్పుడు చూద్దాం. (Images Source : Envato)
సాధారణం జ్వరం ఎక్కువగా ఉంటుంది. అధిక జ్వరం ఉంటుంది. బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారు. (Images Source : Envato)
తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. మరికొందరిలో శరీరం మీద ర్యాష్ వస్తుంది. వీటిని గుర్తిస్తే వెంటనే వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లాలి. (Images Source : Envato)
ముక్కు నుంచి లేదా చిగుళ్ల నుంచి బ్లీడ్ అయ్యే అవకాశముంది. ఇలాంటివి చూస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. (Images Source : Envato)
పిల్లలను బయటకు పంపేప్పుడు వారికి నిండుగా ఉండే బట్టలు వేయాలి. దోమలు కుట్టుకుండా క్రీములు రాయాలి. (Images Source : Envato)
ఇంట్లో దోమలు లేకుండా చూసుకోవాలి. పిల్లల బెడ్లోపలికి దోమలు వెళ్లకుండా తెరలు కట్టాలి. (Images Source : Envato)