Tea Spoil Time : టీ చెడిపోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? తర్వాత తాగితే అస్సలు మంచిది కాదట
టీని ముందుగానే పెట్టుకుని.. దానిని ఎక్కువసేపు మరిగించి తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. ఎందుకంటే టీని ముందుగానే తయారు చేసి పెట్టుకుంటే అది కొంత సమయం తర్వాత చెడిపోతుంది.
టీని తయారు చేసుకుని.. ఎక్కువసార్లు వేడి చేసుకుని తాగితే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు. ఇంతకీ టీ ఎంతసేపట్లో చెడిపోతుంది. దానిని తాగితే కలిగే ఆరోగ్య సమస్యలు ఏంటో చూసేద్దాం.
టీని తయారుచేసిన 2 నుంచి 3 గంటల్లోపే చెడిపోతుందట. టీ తయారు చేసిన 2 గంటలు దాటిన తర్వాత దానిలో ఫంగస్, బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని చెప్తున్నారు.
టీని ప్రిపేర్ చేసిన తర్వాత కూడా ఎక్కువసార్లు వేడి చేసుకుని తాగకూడదని చెప్తున్నారు. ఇది తీవ్ర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందట.
జీర్ణ సమస్యలు పెరుగుతాయి. కడుపు ఉబ్బరం సమస్యలను పెంచుతుంది. కడుపు నొప్పిని కలిగించి.. తలనొప్పి వంటి వాటిని ట్రిగర్ చేస్తుందని చెప్తున్నారు.
అందుకే టీని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం కంటే ఫ్రెష్‌గా పెట్టుకుని తాగడమే బెటర్ అంటున్నారు. ఒకవేళ ముందుగా టీని రెడీ చేసుకున్నా గంటలోపే తాగేస్తే మంచిదంటున్నారు.