Cold Water in Summer : వేసవిలో కూల్ వాటర్ తాగుతున్నారా? ఆ సమస్యలుంటే తాగకపోవడమే మంచిది
సమ్మర్లో కూల్ వాటర్ తాగితే హాయిగా ఉంటుంది. కానీ దానివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని చెప్తున్నారు నిపుణులు.
చల్లని నీరు ఎక్కువగా తాగడం వల్ల గొంతు నొప్పి, వాపు వస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థపై ఇది నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది. జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది.
చల్లటి నీరు రక్త ప్రసరణను దెబ్బతీస్తుంది. గుండెపోటుకు కారణమవుతుంది. పైగా సమ్మర్లో గుండె సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి.
జీవక్రియను నెమ్మది చేస్తుంది. మెటబాలీజం తగ్గడం వల్ల బరువు తగ్గడం కష్టతరం చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు కూల్ వాటర్ని స్కిప్ చేస్తే మంచిది.
కోల్డ్ వాటర్ వల్ల తలనొప్పి, మైగ్రేన్లు ట్రిగర్ అవుతాయి. సెన్సిటివిటీ పెరుగుతుంది. పంటి నొప్పికి కూడా కారణమవుతుంది. కండరాల నొప్పులు వచ్చే అవకాశం ఎక్కువ.
వేడి నీరు, చల్లని నీరు తాగకుండా రూమ్ టెంపరేచర్లో నీటిని తాగితే శరీరానికి ఎక్కువ ప్రయోజనాలు అందుతాయి. ఇవి ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.