Painkillers with Alcohol : ఆల్కహాల్‌తో పాటు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే చచ్చిపోతారా?
మద్యం ఆరోగ్యానికి హానికరం. అయినా సరే కొందరు దానిని తాగుతూ ఉంటారు. అయితే ఇలా మందు తాగినప్పుడు పెయిన్ కిల్లర్స్ తీసుకోవచ్చా? ఇది ప్రాణాంతకమా?
నొప్పి నివారణ కోసం పెయిన్ కిల్లర్స్‌ను ఆల్కహాల్‌తో కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయట. ఇవి రెండూ కాలేయాన్ని నెగిటివ్‌గా ప్రభావితం చేస్తాయట.
మద్యం సేవించిన తర్వాత పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే మెదడులో రక్తస్రావయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట.
మద్యం తీసుకున్న తర్వాత పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే గుండె సమస్యలు కూడా వస్తాయట.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడి కొందరిలో మరణానికి దారితీస్తుందట. మీకు ఇప్పటికే బ్రీతింగ్ సమస్యలుంటే జాగ్రత్తగా ఉండాలి.
అందుకే మద్యం సేవించినప్పుడు కొన్నిగంటల వరకు పెయిన్ కిల్లర్స్ తీసుకోకపోవడమే మంచిదని చెప్తున్నారు.
ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి.