Sreemukhi : ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్తో బరువు తగ్గిన శ్రీముఖి.. యాంకర్ చెప్పిన సీక్రెట్స్ ఇవే
జులాయి సినిమా సమయంలో శ్రీముఖి సన్నగా ఉండేది. తర్వాత వివిధ సమస్యలతో చబ్బీగా మారింది. అలానే పలు షోలు చేసేది.(Images Source : Instagram/Sreemukhi)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅయితే కొన్ని నెలలుగా బరువు తగ్గడంపై ఫోకస్ చేసింది శ్రీముఖి. దానిలో భాగంగానే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ని ఫాలో అవుతుంది. (Images Source : Instagram/Sreemukhi)
రోజులో ఓ పూటే కడుపు నిండుగా తింటూ.. బరువును కంట్రోల్ చేస్తున్నట్లు తన యూట్యూబ్ ఛానల్లో దీని గురించి చెప్పుకొచ్చింది. మొదట్లో కష్టంగా ఉండేదని ఇప్పుడు ఇది బాగా అలవాటు అయిపోయిందని చెప్పింది.(Images Source : Instagram/Sreemukhi)
ఎంత నచ్చిన ఫుడ్ ఎదురుగా ఉన్నా.. ఫాస్టింగ్ విండోని డిస్ట్ర్బ్ కాకుండా చూసుకుంటే ఈ ఫాస్టింగ్లో సక్సెస్ అయిపోయినట్లే అని చెప్పుకొచ్చింది. అయితే ఇది తనకు సూట్ అయ్యిందని అందరూ ఇదే ఫాలో అవ్వాలని రూల్ లేదని తెలిపింది.(Images Source : Instagram/Sreemukhi)
అయితే ఈ ఫాస్టింగ్ వల్ల కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఉంటాయని తెలిపింది. జుట్టు ఎక్కువగా రాలిపోవడం, విటమిన్స్ లోపం వంటి సమస్యలు వస్తాయని తెలిపింది. కాబట్టి ఈ ఫాస్టింగ్ ఫాలో అయ్యేప్పుడు కచ్చితంగా డాక్టర్ల సపోర్ట్ తీసుకోవాలని తెలిపింది. (Images Source : Instagram/Sreemukhi)
మొదట్లో ఏమి తినకపోవడం వల్ల నీరసంగా అనిపించేదని.. కానీ ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంటున్నట్లు శ్రీముఖి తెలిపింది. ఈ ఫాస్టింగ్ విండో గరిష్టంగా 38 గంటలు కూడా చేసిందట శ్రీముఖి.(Images Source : Instagram/Sreemukhi)