Husband Personalities : భర్తలు 7 రకాలు అట.. మీ భర్త ఏ కోవకు చెందుతారో తెలుసుకోండి
పురాతన భారతదేశంలో భర్తలను వారి ప్రవర్తన, వైఖరి ఆధారంగా 7 వేర్వేరు రకాలుగా విభజించారు. సామాజిక వాతావరణంలో భర్తల స్వభావం ఎంత ముఖ్యమైన పాత్ర పోషించిందో ఇది మీకు తెలిసేలాజేస్తుంది.
యజమానిలా ప్రవర్తించేవారు. వీరు కఠినమైన వైఖరితో భార్యలపై అధికారం చెలాయించేవారు. భార్యలు తమ కోరికలను వ్యక్తం చేయకుండా.. వారి నియమాలను, నిర్ణయాలను పాటించాలని.. అంతా వారి ప్రకారమే జీవించాలనుకునేవారు ఒక రకం.
వల్లభుడు అంటే భార్యను ప్రేమించే, కోమల స్వభావం కలిగి.. భార్యకు అండగా నిలిచే భర్త. వివాహం పరస్పర అవగాహన, గౌరవం, ప్రేమతో సాగుతుందని నమ్మేవారు. ప్రాచీన భారతదేశంలో వల్లభుడు అనే కోవకు చెందిన భర్తలను భార్యలు చాలా ఇష్టపడేవారు.
ప్రజాపతి.. ఎవరి మనస్తత్వం సంరక్షకునిలా ఉంటుందో.. వారు ఒక సంరక్షకునిలా కుటుంబానికి రక్షణ కల్పిస్తారు. కుటుంబాన్ని పోషిస్తారు. ఈ వివాహంలో భాగస్వాములు సమానంగా ఉండరు. భర్తదే ఏకపక్షంగా అధికారం చెలాయిస్తారు.
వైరాగి భర్తలు దయగల స్వభావం కలిగి ఉంటారు. కానీ వారు తమ సొంత ప్రపంచంలో ఉండటానికి ఇష్టపడతారు. వీరికి శారీరక సాన్నిహిత్యంలో ఎటువంటి ఆసక్తి ఉండదు. ఇలాంటి భర్తలు తమ భార్యలతో కలిసి కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంలో ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.
సఖా.. వీరు స్నేహపూర్వక స్వభావం కలిగి ఉంటారు. అలాంటి భర్తలు చంచల స్వభావం కలిగి ఉంటూ జీవితాంతం తోడుగా ఉంటారు. అలాంటి భర్తలు వివాహం తర్వాత కూడా తమ భార్యలతో స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తూ సరదాగా జీవితం గడుపుతారు.
గురువుగారు.. వీరికి టీచర్ లాంటి స్వభావం ఉంటుంది. భార్యతో ఆధ్యాత్మిక, నైతిక జీవితం గడుపుతారు. ఇలాంటి భర్తలు నేర్పించే స్వభావంతో వివాహ బంధం భావోద్వేగాల కంటే విలువలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.
దాసుల వంటి మనస్తత్వం కలిగి.. భార్య చెప్పినట్లు వింటూ.. ఆమె కోరికలను నెరవేరుస్తారు. ఇది స్త్రీ ప్రధానమైన వివాహం. ఇక్కడ భార్య పాత్ర ముఖ్యమైనది. పురాతన భారతదేశంలోని సాధువులు పురుషుల వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి వారిని ఈ 7 విభిన్న వర్గాలుగా విభజించారు.