Mobile Usage Tips : ఫోన్‌ని బాత్రూమ్లోకి తీసుకెళ్తున్నారా? ప్యాంట్ పాకెట్లో పెట్టుకుంటున్నారా? అయితే జాగ్రత్త
నేటి కాలంలో చాలామంది బాత్రూంలో కూడా ఫోన్ ఉపయోగిస్తున్నారు. అయితే ఈ అలవాటు మీ ఫోన్‌ను బ్యాక్టీరియా, వైరస్‌లకు కేంద్రంగా మార్చేస్తుంది. పరిశోధనల ప్రకారం.. ఫ్లష్ చేసిన తర్వాత టాయిలెట్ నుంచి విడుదలయ్యే సూక్ష్మ కణాలు గాలిలో వ్యాప్తి చెంది.. మొత్తం బాత్రూమ్ ఉపరితలాలపై పేరుకుపోతాయట.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ హానికరమైన సూక్ష్మక్రిములు ఫోన్లో హానికరమైన సూక్ష్మక్రిములు ప్రవేశించవచ్చు. ఇవి తరువాత మీ చేతులు, శరీరంలో చేరి వ్యాధులను కలిగిస్తాయి. అందుకే బాత్రూమ్కి వెళ్లే ముందు ఎల్లప్పుడూ మీ ఫోన్‌ను బయట ఉంచండి.
అంతేకాకుండా చాలా మంది షర్టు జేబులో ఫోన్ పెట్టుకోవడం గుండెకు దగ్గరగా ఉండటం వల్ల హానికరం అని భావిస్తారు. అలా అని ప్యాంటు జేబులో పెట్టుకుంటారు. కానీ అది కూడా సురక్షితం కాదు. పరిశోధన ప్రకారం ప్యాంటు జేబులో ఫోన్ పెట్టుకుంటే.. పర్స్ లేదా బ్యాగ్‌లో పెట్టుకోవడం కంటే 2 నుంచి 7 రెట్లు ఎక్కువ రేడియేషన్ వస్తుందట. నిరంతరం రేడియేషన్‌కు గురికావడం వల్ల కణితులు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది.
కారు డాష్‌బోర్డ్‌పై స్మార్ట్ ఫోన్‌ను ఉంచకూడదు. ఎందుకంటే ఇక్కడ నేరుగా సూర్యరశ్మి పడటం వల్ల ఫోన్ త్వరగా వేడెక్కుతుంది. ఎక్కువ కాలం వేడిలో ఉండటం వల్ల బ్యాటరీ దెబ్బతినవచ్చు. లేదా పాడయ్యే అవకాశం ఉంది.
అంతేకాకుండా చాలాసార్లు ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టి రాత్రిపూట అలా వదిలేస్తారు. అలా చేయడం కూడా ప్రమాదకరమని చెప్తున్నారు. అలా చేయడం వల్ల ఫోన్ ఓవర్ఛార్జ్ అయి పేలిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల పెద్ద నష్టం వాటిల్లుతుంది. అందుకే రాత్రిపూట ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టి నిద్రపోకూడదు.