Livein Relationship : లివ్-ఇన్ రిలేషన్లో ఉన్నప్పుడు బిడ్డ పుడితే తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుందా?
భారత న్యాయ వ్యవస్థ.. లివ్ ఇన్ రిలేషన్‌కి కొన్ని షరతులతో కూడిన గుర్తింపునిచ్చింది. సుప్రీంకోర్టు, హైకోర్టులు చాలా కేసుల్లో వీటిని స్పష్టం చేశాయి. రిలేషన్ ఎక్కువ కాలం ఉంటే.. దానిని వివాహ బంధానికి సమానంగా పరిగణించవచ్చు. కానీ పిల్లల హక్కులకు సంబంధించి నియమాలు కొంచెం భిన్నంగా ఉన్నాయి.
హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. తండ్రి సొంతంగా సంపాదించిన ఆస్తిపై సహజీవనం ద్వారా పుట్టిన పిల్లలకు హక్కు ఉంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తి వారసత్వంగా పొందినట్లయితే.. పిల్లలు దానిలో తమ భాగాన్ని కూడా క్లెయిమ్ చేయవచ్చు. అయితే దీనికి సంబంధించిన నియమాలు స్పష్టంగా లేవు.
సుప్రీం కోర్ట్ చాలా సార్లు చెప్పింది ఏమిటంటే సహజీవనం చాలా కాలం పాటు స్ట్రాంగ్‌గా, బహిరంగంగా చెల్లుబాటు అయితే అటువంటి సంబంధంలో పుట్టిన బిడ్డను చట్టబద్ధమైనదిగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో ఆ బిడ్డ తండ్రి ఆస్తిలో వాటాదారుడు కావచ్చు. అయితే ఈ హక్కు ఆస్తి రకం, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
స్వయంగా సంపాదించిన ఆస్తి విషయంలో యజమానికి తన ఆస్తిని ఎవరికైనా ఇవ్వాలా లేదా అనేది నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో తండ్రి వీలునామా రాసి తన సహజీవన భాగస్వామితో కలిగిన బిడ్డకు ఆస్తిని ఇవ్వవచ్చు. కానీ వీలునామా లేకుండా అటువంటి బిడ్డకు ఈ ఆస్తిపై చట్టపరమైన హక్కు ఉండదు.
పూర్వీకుల ఆస్తి విషయంలో ఇది భిన్నంగా ఉంటుంది. హిందూ చట్టం ప్రకారం.. ప్రతి చట్టబద్ధమైన సంతానానికి పుట్టుకతోనే వాటా లభిస్తుంది. ఒకవేళ న్యాయస్థానం సహజీవన సంబంధాన్ని చట్టబద్ధం చేస్తే.. వీలునామా ఉన్నా లేకున్నా ఆ పిల్లవాడు కూడా ఈ ఆస్తిలో సమాన హక్కుదారుడిగా ఉండవచ్చు.
మొత్తంగా చెప్పాలంటే సహజీవనంలో పుట్టిన పిల్లల హక్కులు ఆస్తి రకం, కోర్టు గుర్తింపు, చట్టపరమైన పత్రాలపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల అలాంటి సందర్భాలలో సరైన సమాచారం కోసం కుటుంబ న్యాయ నిపుణుడిని సంప్రదించడం చాలా అవసరం.