Digital Detox Tips : డిజిటల్ డిటాక్స్ ఇలా చేయండి.. ఈ చిట్కాలతో స్క్రీన్ టైమ్ తగ్గించుకోవచ్చు
ఉదయం నుంచి రాత్రి వరకు మొబైల్, లాప్‌టాప్‌లలో మునిగిపోతున్నారా? కాబట్టి ఫోన్, టీవీ, లాప్‌టాప్‌లలో ఎంత సమయం ఉండాలో ముందుగానే ప్లాన్ చేసుకోండి. లేకుంటే ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు.
పదే పదే నోటిఫికేషన్లు రావటం వలన మనసు త్వరగా డైవర్ట్ అవుతుంది. దానివల్ల మనం పదే పదే ఫోన్ చూస్తూ ఉంటాము. అందువల్ల పనికిరాని యాప్‌ల నోటిఫికేషన్లను ఆపివేస్తే మంచిది.
నిద్ర నాణ్యతను కాపాడుకోవడానికి నిద్రపోయే ముందు కనీసం 1 గంట ముందు స్క్రీన్లకు దూరంగా ఉండండి. ఇది మెదడుకు విశ్రాంతినిస్తుంది. నిద్ర త్వరగా వస్తుంది.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఫోన్, సోషల్ మీడియాలో చాట్ చేయడానికి బదులుగా డైరక్ట్ వారితో సమయం గడిపేందుకు ప్రయత్నించండి. ఇది మానసిక ఆరోగ్యానికి మంచిది.
ఖాళీ సమయంలో ఫోన్ వాడటం కంటే నడవడానికి వెళ్లిండి. యోగా చేయండి లేదా ఏదైనా స్పోర్ట్ ఆడండి. ఇది శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది. స్క్రీన్ సమయం కూడా తగ్గుతుంది.
ఫోన్‌ను మంచంకి దగ్గర ఉంచడం వల్ల మనం పదే పదే దాన్ని చూస్తాము. కాబట్టి ఫోన్‌ను బెడ్ రూమ్ బయట ఉంచితే రాత్రి సమయంలో స్క్రీన్ టైమ్ తగ్గుతుంది.
ప్రతి వారం ఒక రోజు సోషల్ మీడియా, స్క్రీన్ నుంచి పూర్తిగా దూరంగా ఉండాలి. ఇది మనసుకు విశ్రాంతినిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.