Lemon for Health : నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఎక్కువ తింటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు
నిమ్మకాయ విటమిన్ సి కి మంచి ఆధారం. ఇది జలుబు, ఫ్లూతో పోరాడటానికి హెల్ప్ చేస్తుంది. నిమ్మరసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, అసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
నిమ్మకాయ మెటబాలీజంను పెంచుతుంది. తద్వారా బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. నిమ్మరసం శరీరంలోని టాక్సిన్లను తొలగించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మెరుపునిస్తాయి.
నిమ్మకాయలో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. దీనిని ఎక్కువగా తీసంకుంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇవి దంతాలపై ఎనామిల్‌ను దెబ్బతీస్తాయి. దీనివల్ల దంతాల సున్నితత్వం పెరుగుతుంది. అలాంటప్పుడు నిమ్మరసం కలిపిన నీరు తాగిన తర్వాత నోటిని పుక్కిలించాలి. లేదా నీటిని తాగేందుకు స్ట్రా ఉపయోగించాలి.
ఎసిడిటీ లేదా గుండెల్లో మంట సమస్య ఉన్నవారు నిమ్మకాయను ఎక్కువగా తీసుకోకూడదు. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఈ సమస్యలను పెంచుతుంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తాగితే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇది పెప్సిన్ ఎంజైమ్‌ను యాక్టివేట్ చేసి గుండెల్లో మంట సమస్య పెంచుతుంది.
నిమ్మకాయ ఎక్కువగా తీసుకుంటే పదేపదే మూత్రం రావడానికి కారణం అవుతుంది. అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి కొరత, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడవచ్చు. ఇందులో సిట్రిక్ ఆమ్లం కాకుండా కొంత మోతాదులో ఆక్సలేట్ కూడా ఉంటుంది. ఎక్కువగా తీసుకుంటే.. క్రిస్టల్స్ రూపంలో ఆక్సలేట్ పేరుకుపోవచ్చు. దీనివల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది.
కొన్ని పరిశోధనల్లో నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయని తేలింది. కాబట్టి ప్రతి దానిలాగే నిమ్మకాయను కూడా పరిమిత మోతాదులో తీసుకోవాలి.
ఉడికించిన లేదా చాలా వేడిగా ఉన్న ఆహారంలో నిమ్మరసం కలపకూడదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే విటమిన్ సి వేడికి సున్నితంగా మారి దానిలోని పోషకాలు తగ్గుతాయి. కాబట్టి వంట పూర్తయిన తర్వాత లేదా చల్లారిన తర్వాత కలిపితే మంచిది.
పప్పు లేదా ఆకుకూరల్లో నిమ్మరసం కలపడం వల్ల ఐరన్, ఇతర పోషకాల శోషణ మెరుగ్గా ఉంటుంది. పప్పు తింటే వచ్చే జీర్ణ సమస్యలను పెంచుతుంది. నిమ్మకాయ ఆరోగ్యకరమైన, రుచికరమైన పదార్ధమే. కానీ దానిని ఆలోచించి తీసుకోవడం మంచిది. మీ శరీరం చెప్పే మాట వినండి. సమస్య ఉంటే నిపుణుడిని సంప్రదించండి.