Amazon Prime Day Sale 2025 : అమెజాన్ సేల్‌లో 30వేల కంటే తక్కువ ధరలో లభిస్తోన్న స్మార్ట్ ఫోన్లు ఇవే.. బడ్జెట్ ఫ్రెండ్లీ డీల్స్
అమెజాన్ సేల్‌లో OnePlus Nord CE 5 5Gని 24,998 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 67 అంగుళాల.. పూర్తి HD+ OLED డిస్ప్లేను కలిగి ఉంది. ఫోన్లో MediaTek Dimensity 8350 ప్రాసెసర్ కూడా ఉంది. ఇది రోజువారీ పనుల నుంచి గేమింగ్ వరకు అద్భుతమైన పనితీరును అందిస్తుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ (50MP+8MP), 16MP ఫ్రంట్ కెమెరా, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7100mAh బ్యాటరీని కలిగి ఉంది.
iQOO Neo 10R కూడా ఈ సేల్‌లో చాలా ఫేమస్ అయింది. దీని విలువ 25,998. స్నాప్ డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్‌తో, 6.78 అంగుళాల AMOLED డిస్ప్లే (144Hz), 6400mAh బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఇది గేమింగ్ ఆడేవారికి కూడా మంచి ఆప్షన్. 50MP+8MP డ్యూయల్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది ఫోటోగ్రఫీకి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
Honor 200 ఫోన్ ధర ప్రైమ్ డేలో 21,748 రూపాయలకు అందుబాటులో ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో అందరికీ అందరికీ నచ్చేలా దీనిని డిజైన్ చేశారు. ఇది Qualcomm Snapdragon 7 Gen 3 చిప్సెట్తో వచ్చింది. 6.7 అంగుళాల OLED డిస్ప్లే (120Hz), 5200mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో డిజైన్ చేశారు. కెమెరా సెటప్ కూడా చాలా బాగుంది. బ్యాక్ కెమెరా 50MP+50MP+12MP, ఫ్రంట్ కెమెరా 50MPతో వచ్చింది.
Samsung Galaxy M36 ఈసారి 17,499 రూపాయలకే దొరుకుతుంది. 6.7 ఇంచుల సూపర్ AMOLED డిస్ప్లేతో ఇది అందుబాటులో ఉంది. Exynos 1380 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీతో ఇది బడ్జెట్లో వస్తుంది. 50MP 8MP 2MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో 13MP ముందు కెమెరాతో అందుబాటులో ఉంది.
Oppo F29 ని కూడా 25,998 ధరతో సేల్‌లో ఉంది. ఇందులో Snapdragon 6 Gen 1 చిప్సెట్, 6.7 అంగుళాల FHD+ డిస్ప్లే (120Hz), 6500mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. కెమెరా సెటప్‌లో 50MP+2MP డ్యూయల్ రియర్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇవి సోషల్ మీడియా వినియోగదారులకు బాగా నచ్చుతుంది.
Tecno Camon 30 Premier 29,499తో అమెజాన్ సేల్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6.77 అంచుల LTPO AMOLED డిస్ప్లే 120Hz Dimensity 8200 అల్టీమేట్ ప్రాసెసర్‌తో వచ్చింది. 5000mAh బ్యాటరీ, 70W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పనిచేస్తుంది. బ్యాక్ కెమెరా 50MP, 50MP, 50MP ఫ్రంట్ కెమెరా కూడా 50MPతో వస్తుంది.