Krishna Janmashtami Looks : కృష్ణాష్టమికి మీ పిల్లలను ఇలా ముస్తాబు చేయండి.. ఈ క్యూట్ కన్నయ్య లుక్స్ ఫోటోలకు బెస్ట్
పసుపు ధోతీ, నెమలి ఈక, సింపుల్ కిరీటం, ముత్యాల దండ, నడుముకు కట్టుకునే చైన్, చేతిలో పిల్లనగ్రోవి, లైట్ మేకప్ పిల్లలకు చాలా బాగుంటుంది. పైగా వారు ఇబ్బంది లేకుండా ఎక్కువసేపు ఉంచుకోగలుగుతారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకృష్ణాష్టమి రోజు ముస్తాబు చేసేందుకు పిల్లలకు ధోతీ, కుర్తా కుట్టించవచ్చు. కన్నయ్య దుస్తుల కోసం.. పసుపు లేదా తెలుపు ధోతీ, బంగారు అంచు కలిగినది ఎంచుకుంటే బెస్ట్. కేవలం ధోతీ వద్దనుకుంటే.. సౌకర్యవంతంగా, స్టైలిష్‌గా ఉండే ధోతీ కుర్తా సెట్ తీసుకోండి.
ఈ జన్మాష్టమి నాడు పిల్లలకు రాకుమారుడు లుక్‌లో కృష్ణుడిగా ముస్తాబు చేయాలనుకుంటే.. నీలం లేదా తెలుపు రంగు పట్టు ధోతీ ట్రై చేయవచ్చు. లేదా కుర్తా సెట్ ధరించవచ్చు. నెమలి కిరీటం, ఆభరణాలు కూడా ధరించవచ్చు. ఈ రాకుమారుడు కృష్ణ లుక్‌లో పిల్లలు చాలా అందంగా కనిపిస్తారు.
రంగురంగుల ప్రింటెడ్ హరే రామ, హరే కృష్ణ ఫీల్‌ని తీసుకొచ్చే కుర్తా సెట్లు కూడా ఉంటాయి. ఈ జన్మాష్టమికి మీ పిల్లలకు వీటిని ట్రై చేయవచ్చు. ఇవి పిల్లలకు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అలాగే పిల్లలకు మాలలు, గాజులు, నడుము పట్టీని చేసి లుక్ కంప్లీట్ చేయవచ్చు.
కృష్ణాష్టమి నాడు మీ పిల్లలకు కాస్త విభిన్నమైన కాస్ట్యూమ్ వేయాలనుకుంటే.. నవ్వులు పూయించే వెన్న దొంగ కాస్ట్యూమ్‌ను ప్రయత్నించవచ్చు. మెడలో చిన్న మట్టి పాత్ర వేలాడదీయండి. తలపై చిన్న కిరీటం, పిల్లనగ్రోవిని ఉంచండి. ముఖానికి కొద్దిగా వెన్న రాసి వదిలేయండి. ఈ లుక్ చాలా ఫన్నీగా, అందంగా కనిపిస్తుంది.
కృష్ణాష్టమి నాడు మీ పిల్లలకు సింపుల్ కాస్ట్యూమ్ వేసి, యాక్సెసరీస్‌తో లుక్‌ను పూర్తి చేయవచ్చు. నెమలి పించం, కిరీటం, పిల్లనగ్రోవి, ముత్యాల దండ, బాజుబంద్, కంకణాలు, నడుము పట్టీ, భుజంపై పసుపు రంగు దుపట్టా వేసి రెడీ చేయవచ్చు.