Tips for Renting a House : అద్దెకు ఇల్లు తీసుకునే ముందు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే
ఇంటి యజమాని చెప్పే నియమాలు అద్దెకు వచ్చేవారు నిజమని భావిస్తారు. కానీ అవి నిజం కాదు. ఇల్లు అద్దెకు తీసుకునే ముందు మీరు కొన్ని విషయాలు మీరు తెలుసుకోవడం మంచిది. అద్దెకు ఉండేవారికి కూడా హక్కులు ఉన్నాయో చూద్దాం.
అద్దె, సెక్యూరిటీ, విద్యుత్, నీటి ఖర్చులు, నోటీసు వ్యవధి వంటి విషయాలను మీరు అద్దె ఒప్పందంలో రాసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతిదీ రాతపూర్వకంగా ఉంటుంది. దీనివల్ల ఎలాంటి వివాదాలు రాకుండా ఉంటాయి.
అద్దెకు ఉండేప్పుడు యజమానికి నిర్దిష్ట పరిమితి ఎక్కువ డిపాజిట్ అడిగే రైట్ ఉండదు. కొన్ని రాష్ట్రాల్లో దానికి సంబంధించిన కొన్ని నిబంధనలు ఉన్నాయి. కొన్నిసార్లు ఇంటి యజమానులు మూడు నుంచి ఆరు నెలల డిపాజిట్ అడగవచ్చు. కానీ మీరు రెండు నెలలు ఇస్తే సరిపోతుంది.
కొంతమంది ఇంటి యజమానులు అతిథులను అనుమతించకూడదు. కేవలం వెజ్ మాత్రమే వండాలి.. ఇంట్లో ఈ వస్తువులు ఉంచకూడదు వంటి కండీషన్స్ పెట్టకూడదు. ఇవి లీగల్ షరతులు కాదు.
అద్దెకు ఇస్తున్నట్లయితే.. ఆ ఇంట్లో మీకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలి. ఏదైనా షరతు మీకు సముచితంగా అనిపించకపోతే.. దానిని తిరస్కరించే అధికారం మీకు ఉంది. అంతేకాకుండా.. ఇంటి యజమాని నోటీసు లేకుండా మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని చెప్పలేరు. ప్రతి రాష్ట్రంలో దీని కోసం ఒక నిర్దిష్ట నోటీసు వ్యవధి ఉంటుంది.
నిర్వహణ బాధ్యత కేవలం అద్దెదారుడిది కాదు. ఇంట్లో ఏదైనా సమస్య లేదా పైప్లైన్ వంటివి పాడైపోతే, యజమాని స్వయంగా మరమ్మతులు చేయించాలి. అద్దెదారుడి నుంచి మరమ్మత్తుకు డబ్బులు తీసుకోవడం సరికాదు. దీని గురించి కూడా అగ్రిమెంట్లో స్పష్టంగా రాసుకోవాలి.