Tasty Watermelon : పుచ్చకాయ కోయకుండానే టేస్టీగా ఉంటుందో లేదో ఇలా చెక్ చేసేయండి.. సింపుల్ ట్రిక్
వేసవికాలంలో పుచ్చకాయకుండే డిమాండ్ వేరు. పిల్లలనుంచి పెద్దలవరకు అందరూ దీనిని ఇష్టంగా తింటారు. ఈ సమయంలో టేస్టీగా, జ్యూసీగా ఉండే పుచ్చకాయను ఎంచుకోవడం కోసం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.
పుచ్చకాయను కోయకుండా తియ్యగా ఉంటుందో.. లోపల ఎర్రగా ఉంటుందో లేదో తెలియదు. కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే మీరు తియ్యని, టేస్టీ పుచ్చకాయను గుర్తించవచ్చు.
పుచ్చకాయ తియ్యగా, లోపల ఎర్రగా ఉందో లేదో తెలుసుకునేందుకు.. మీ వేలితో దానిని తట్టండి. శబ్ధం పెద్దగా వస్తే పుచ్చకాయ లోపల ఎర్రగా, తియ్యగా, జ్యూసీగా ఉంటుందని అర్థం.
అదే చిన్న శబ్ధం వస్తే అది సరిగ్గా పండని పుచ్చకాయగా గుర్తించాలి. బాగా పండి, తియ్యగా ఉండేది అయితే దాని సౌండ్ గట్టిగా వస్తుంది.
ముదురు ఆకుపచ్చని చారలు పుచ్చకాయపై ఉంటే అవి బాగా పండినవి.. ఎరుపు రంగులో ఉంటాయని గుర్తించాలి. కాబట్టి హైబ్రీడ్ పుచ్చకాయలు కాకుండా నార్మల్ పుచ్చకాయలు కొనేప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
తియ్యగా ఉండే పుచ్చకాయ బరువు చూసేదానికన్నా ఎక్కువగా అనిపిస్తుంది. అలాగే పుచ్చకాయ పైభాగం కూడా షైనీగా కనిపిస్తుంది.