Midnight Snacks : మిడ్ నైట్ క్రేవింగ్స్‌ని తగ్గించే హెల్తీ స్నాక్స్.. రాత్రుళ్లు ఆకలేస్తే తినేయండి
రాత్రి వేళ తేలికైన, సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే ఊబకాయ సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా శరీరానికి ఇతర ప్రయోజనాలు కూడా అందుతాయి. మరి రాత్రుళ్లు తినదగిన హెల్తీ స్నాక్స్ ఏంటో చూసేద్దాం.
అర్ధరాత్రి సమయంలో ఆకలి వేసినప్పుడు పాప్ కార్న్ తినవచ్చు. కానీ బటర్ వేసినవి లేదా ఎక్కువ మోతాదులో తీసుకోకపోతే మంచిది.
రాత్రి సమయంలో ఆకలి వేసినప్పుడు చిన్న పనీర్ ముక్క తినండి. ఇది ఆకలిని నియంత్రిస్తుంది.
రాత్రి సమయంలో ఆకలి వేసినప్పుడు శనగపిండితో చేసిన చీలా కూడా తినొచ్చు. ఇది ఆరోగ్యానికి మంచిది కూడా.
రాత్రిపూట స్నాక్స్‌లో భాగంగా మీరు మఖానాను తీసుకోవచ్చు. ఇది కడుపు నిండేలా చేస్తుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.
రాత్రి సమయంలో ఆకలి వేసినప్పుడు ఫ్రూట్స్ తినొచ్చు. ఇవి ఆరోగ్యానికి మంచివి.
రాత్రి సమయంలో మీరు 10-15 నట్స్ తీసుకోవచ్చు. అయితే మీరు రాత్రుళ్లు డిన్నర్గా అయినా.. లేదా స్నాక్‌గా అయినా ఏ ఫుడ్ తీసుకున్నా లిమిటెడ్‌గా తీసుకుంటే మంచిది.