Medical Tests for Health Problems : కిడ్నీ, గుండె, లివర్ వ్యాధులు రావడానికి ముందే ఈ టెస్ట్లు చేయించుకోండి.. నివారించవచ్చు
మీ శరీరంలో వ్యాధులు లేదా ఏదైనా అవయవం దెబ్బతినడానికి ముందే సమాచారాన్ని పొందాలనుకుంటే.. సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ పరీక్ష చేయించుకోవాలి. ఇది చాలా నార్మల్ టెస్ట్. దీని సహాయంతో ఎర్ర రక్త కణాలు, ప్లేట్‌లెట్స్, తెల్ల రక్త కణాల ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా రక్తహీనత వంటి వ్యాధిని గుర్తించవచ్చు. శరీర రోగనిరోధక శక్తి ఎంత బలమైనదో కూడా తెలుసుకోవచ్చు.
లివర్, కిడ్నీ వర్కింగ్ టెస్ట్ ద్వారా శరీరంలోని రెండు ముఖ్యమైన అవయవాలైన కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చు. ఈ పరీక్షల సహాయంతో భవిష్యత్తులో వచ్చే వ్యాధుల నుంచి రక్షించవచ్చు.
గుండె జబ్బులు, గుండె సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించాలనుకుంటే.. రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించాలి. దీనితో స్ట్రోక్, గుండెపోటు వంటి తీవ్రమైన సమస్యలను ముందుగానే గుర్తించి నివారించవచ్చు.
మీరు మీ మూత్రపిండాలను వ్యాధులు లేదా మూత్ర మార్గము ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించాలనుకుంటే.. ప్రతి ఒకటి లేదా రెండు నెలలకు మూత్ర పరీక్ష చేయించుకోవాలి. ఇది మూత్రపిండాలకు సంబంధించిన ఏదైనా సమస్య లేదా వ్యాధిని ముందుగానే గుర్తిస్తుంది.
మీరు గుండె సంబంధిత వ్యాధుల గురించి ముందుగానే తెలుసుకోవాలనుకుంటే.. లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. ఈ పరీక్ష ద్వారా రక్తంలో కొవ్వు, కొలెస్ట్రాల్ పరిమాణాన్ని కొలుస్తారు. ఇది భవిష్యత్తులో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
థైరాయిడ్ ప్యానెల్ కూడా ఒక రకమైన రక్త పరీక్ష.. దీని ద్వారా మెడ దిగువ భాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేస్తుందా? లేదా? అనే సమాచారం అందుతుంది. ఈ గ్రంథి మన శరీర జీవక్రియను నియంత్రిస్తుంది.