Hot Water Bath : శీతాకాలంలో వేడి నీటితో స్నానం చేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే
వైద్యుల ప్రకారం.. చలికాలంలో వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందులో సోరియాసిస్, ఎగ్జిమా వంటి తీవ్రమైన వ్యాధులు కూడా ఉన్నాయి.
చర్మవ్యాధి నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరం, చర్మంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది చర్మ సహజ తేమను తొలగిస్తుంది. దీని వలన చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి. చలికాలంలో చర్మ వ్యాధిగ్రస్తులకు స్నానం చేసే సరైన విధానాన్ని వైద్యులు సూచించారు.
చలికాలంలో ఎక్కువ వేడి నీటితో స్నానం చేయకూడదని.. గోరువెచ్చని నీటితో స్నానం చేయాలని చెబుతున్నారు. స్నానం చేసిన వెంటనే చర్మం తేమగా ఉండటానికి శరీరమంతా మాయిశ్చరైజర్ బాగా రాయాలి.
చలికాలంలో మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే.. ఎక్కువ రసాయనాలు కలిగిన సబ్బులను ఉపయోగించకూడదు. సబ్బులో ఎక్కువ రసాయనాలు ఉండటం వల్ల చర్మం పై పొర దెబ్బతింటుంది.
చలికాలంలో స్నానం చేసేటప్పుడు, స్నానం చేసిన తర్వాత శరీరం నుంచి సబ్బు లేదా షాంపూ నురుగు పూర్తిగా తొలగించండి. ఎందుకంటే నురుగు చర్మం లేదా తలపై ఉండిపోతే.. ఆరిన తర్వాత చర్మం, స్కాల్ప్ పొడిగా చేస్తుంది.
చలికాలంలో చర్మంపై రకరకాల రసాయనాలు కలిగిన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఇవి శరీరానికి హాని కలిగించవచ్చు. ఎక్కువ రసాయనాలు కలిగిన సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించకూడదు.
మీరు చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేయడానికి ఇష్టపడితే.. నేరుగా చల్లటి నీటితో కాకుండా.. మొదట గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. తద్వారా శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటుంది. స్నానం చివరి సమయంలో చల్లటి నీటిని ఉపయోగించండి.