Sleeping Tips : నిద్ర రావట్లేదని మాత్రలు వేసుకోకండి.. ఈ ఆకులతో సమస్యను దూరం చేసుకోండి
తులసి ఆకులను నిద్రను ప్రేరేపించడానికి బాగా హెల్ప్ చేస్తాయి. కాబట్టి రాత్రి పడుకునే ముందు 4-5 తులసి ఆకులను నమలడం లేదా తులసి టీ తాగండి. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది. నిద్ర త్వరగా వస్తుంది.
వేప ఆకులు శరీరాన్ని లోపలి నుంచి నిర్విషీకరణ చేయడంతో పాటు.. నిద్రకు కూడా బాగా హెల్ప్ చేస్తుంది. వేప టీ తీసుకోవడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
పుదీనా మెదడు, నరాలకు ఉపశమనం కలిగిస్తుంది. పుదీనా తినడం లేదా దాని టీ తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. దీనివల్ల గాఢ నిద్ర వస్తుంది.
వామ్ము ఆకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తొలగిస్తాయి. పొట్ట తేలికగా, మనస్సు ప్రశాంతంగా ఉంచుతాయి. దీనివల్ల నిద్ర సహజంగానే త్వరగా వస్తుంది.
బ్రాహ్మీ ఆకులను ఆయుర్వేదంలో మెదడును శాంతపరిచే ఔషధంగా పేర్కొంటారు. ఇది మెదడు అలసట, ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనివల్ల రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర వచ్చేలా చేస్తుంది.
అశ్వగంధా ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దీని ఆకుల వినియోగం నిద్రను ప్రేరేపించే సహజ ఔషధంలా పనిచేస్తుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.