Best Countries for Skilled Workers : పెరిగిపోయిన H-1B Visa ఫీజులు.. అమెరికా కాకుండా ఇండియన్స్ జాబ్ చేసేందుకు ఈ దేశాలు బెస్ట్ ఆప్షన్
అమెరికాలో హెచ్-1బి వీసా కోసం చెల్లించాల్సిన ఫీజల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇకపై ఈ వీసా కోసం కంపెనీలు లక్ష డాలర్లు (సుమారు 88 లక్షల రూపాయలు) ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీనిపై ట్రంప్ వెనక్కి తగ్గుతాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
అయినా సరే ఈ నిర్ణయం తరువాత అమెరికాలో పనిచేయడానికి విదేశీ కార్మికులను నియమించుకోవడం కంపెనీలు ఎక్కువ ఖర్చు చేయనుంది. ఈ సమయంలో అమెరికాలో ఉద్యోగ అవకాశాలు పొందడం చాలా ఖర్చుతో కూడుకున్నవిగా మారనున్నాయి. అయితే నైపుణ్యం కలిగిన ఉద్యోగాల కోసం అమెరికాకు కాకుండా ఏ దేశానికి వెళ్లవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికాకు బదులుగా జాబ్ చేసేందుకు వెళ్లేందుకు ఇంకా మరెన్నో దేశాలు ఉన్నాయి. మంచి స్కిల్స్ ఉన్న కార్మికులకు సులభంగా వర్క్ వీసా లభిస్తుంది. అక్కడ మంచి జీతం, సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఉద్యోగులు వెళ్లగలిగే 3 దేశాలు ఏంటో చూసేద్దాం.
ఉద్యోగం చేయడానికి సింగపూర్ ఉత్తమ ఎంపిక. ఇక్కడ నైపుణ్యం కలిగిన కార్మికులకు ఎంప్లాయ్మెంట్ పాస్ (EP) లభిస్తుంది. బ్యాంకింగ్, IT, మార్కెటింగ్, సాంకేతిక రంగాలలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ జీతం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. వీసా ప్రక్రియ సులభంగా ఉండటం వల్ల భారతీయులకు ఇక్కడ పని చేయడం సులభంగా, సౌకర్యవంతంగా ఉంటుంది.
కెనడా అమెరికాకు పొరుగు దేశంగా ఉండటమే కాకుండా.. నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు అద్భుతమైన ఎంపిక. ఇక్కడ ఫెడరల్ స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్ (FSWP) కింద విదేశీ కార్మికులకు సులభంగా వర్క్ వీసా లభిస్తుంది.
కెనడాలో ఐటీ, ఇంజనీరింగ్, సాంకేతిక రంగాలల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. కెనడాలో పనిచేసే కార్మికులకు శాశ్వత నివాసం (PR) కూడా సులభంగా లభిస్తుంది.
జర్మనీలో ఇంజనీరింగ్ రంగంలో నైపుణ్యం ఉన్నవారికి మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ ఉద్యోగం కోసం వెతుక్కునేవారికి వీసా ఈజీగా లభిస్తుంది. దీనితో ఆరు నెలల వరకు దేశంలో ఉండి ఉద్యోగం వెతుక్కునే అవకాశం లభిస్తుంది. ఉద్యోగం లభించిన తరువాత దీనిని వర్క్ వీసాగా మార్చుకోవచ్చు. దీనితో పాటు EU బ్లూ కార్డ్ ప్రోగ్రామ్ కింద కూడా విదేశీ కార్మికులు జర్మనీలో సులభంగా పని చేయవచ్చు.