Cycling In Metro Cities: మెట్రో సిటీస్‌లో సైక్లింగ్‌పై పెరుగుతున్న ఆసక్తి - ఆరోగ్యకరమైన రేపటి కోసం ముందడుగు
ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలో సైక్లింగ్ వాడకం అమాంతం పెరిగింది. సైక్లింగ్ కేవలం ఒక హాబీగా లేదా ఫిట్‌నెస్ ట్రైనింగ్‌లో భాగంగా మాత్రమే కాకుండా, ప్రతి రోజు జీవనంలో ఒక ప్రధాన భాగంగా మారింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదేశవ్యాప్తంగా ప్రజలు షార్ట్ కమ్యూట్‌లు, ఆరోగ్య ప్రయోజనాల కోసం సైక్లింగ్‌ను వినియోగిస్తున్నారు. 80 వ దశకం వరకు బైసైకిల్ సాధారణ రవాణా సాధనంగా ఉండేది, కానీ మోటారు వాహనాల ఉధృతితో బైసైకిల్ వినియోగం తగ్గింది.
అయితే కోవిడ్-19 మహమ్మారి ప్రజల జీవనశైలిలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది, ముఖ్యంగా వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి పెరిగింది.
2021లో ప్రారంభమైన హైదరాబాద్ సైక్లింగ్ రివల్యూషన్ (HCR) సురక్షిత, సుస్థిరమైన రవాణా పద్ధతిగా సైక్లింగ్‌ను ప్రోత్సహిస్తోంది. ఈ కార్యక్రమం 2030 నాటికి 50% మంది హైదరాబాద్ ప్రజలు ప్రజా రవాణాను వినియోగించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోంది.
ఆక్టివ్ మొబిలిటీపై దృష్టి సారిస్తూ సైక్లింగ్, నడక, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగాన్ని పెంచడానికి ఈ కార్యక్రమం ప్రాధాన్యత ఇస్తోంది.
సైక్లింగ్ విప్లవం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, ఢిల్లీ, ముంబై, శ్రీనగర్, బెంగుళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో సైక్లింగ్ క్లబ్బులు ఏర్పాటవడంతో సైక్లింగ్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది.
image 7
Cycle to Work వంటి కార్యక్రమాలు పలు నగరాల్లో విశేష ఆదరణ పొందుతున్నాయి. బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో IT ప్రొఫెషనల్స్ సైక్లింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఔటర్ రింగ్ రోడ్ నుంచి ప్రథాన ఐటి కారిడార్లకు ప్రత్యేక సైక్లింగ్ ట్రాక్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో సైక్లిస్ట్‌లు రోజువారీ ప్రయాణాలకు బైసైకిల్‌ను ఉపయోగిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని స్మార్ట్ సిటీల్లో సైక్లింగ్ పట్ల ప్రజల ఆసక్తి విపరీతంగా పెరిగింది. ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక సైక్లింగ్ ట్రాక్‌లు, సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్‌ల అమలుకు చొరవ చూపుతున్నాయి.