Free Condom Distribution : కండోమ్స్ ఉచితంగా ఇచ్చే దేశమిదే.. 18 ఏళ్లలోపు వారికి కూడా, కారణం ఇదే
ఫ్రాన్స్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు ఉచితంగా కండోమ్‌లు పంపిణీ చేస్తుంది. లైంగిక సంబంధిత వ్యాధులు సోకకుండా.. అవాంఛిత గర్భాలను నివారించడమే లక్ష్యంగా ఫ్రాన్స్ ప్రభుత్వం పనిచేస్తుంది.
చిన్న వయసులో ఉండే అబ్బాయిలు, అమ్మాయిలు సరైన అవగాహన లేక.. లేదా సిగ్గు వల్ల కారణంగా కండోమ్‌లను కొనేందుకు వెనుకాడతారు. దీనివల్ల వారు ఇబ్బందుల్లో పడతారు. అందుకే అక్కడి ప్రభుత్వం ఎవరికైనా కండోమ్‌లు కొనడానికి ఆర్థికంగా లేదా సామాజికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూసుకుంటోంది.
అందుకే ఫ్రాన్స్‌లో కండోమ్‌లు ఫార్మసీలు, యూనివర్సిటీ హెల్త్ సెంటర్లు, క్లినిక్‌లలో సులభంగా లభిస్తాయి. అక్కడ నియమం స్పష్టంగా ఉంటుంది. 16 సంవత్సరాలు లేదా 18 సంవత్సరాలు పైబడిన వారికి వీటిని ఫ్రీగా ఇస్తారు.
ఎవరైనా లైంగికంగా సురక్షితంగా ఉండాలనుకుంటే.. కండోమ్స్ కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. దీనిగురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్ బహిరంగంగానే ప్రకటించారు.
యువత లైంగిక ఆరోగ్యం గురించి మరింత అవగాహన కలిగి ఉండాలని, సురక్షితమైన మార్గాలను అనుసరించేలా చేయడం ప్రభుత్వం బాధ్యతగా చెప్తారు.
ఎయిడ్స్, ఇతర లైంగిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించేందుకు కండోమ్‌లను అందుబాటులో ఉంచడం తన బాధ్యతగా చెప్తోంది ప్రభుత్వం.
అవాంఛిత గర్భధారణలు, STIs అంటే లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లను నివారించడానికి, తగ్గించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తరువాత ఫ్రాన్స్‌లో ఈ కేసులలో తగ్గుదల కనిపించినట్లు రిపోర్ట్స్ చెప్తోన్నాయి.