Don't Eat These Foods in the Morning : నిద్ర లేచిన వెంటనే ఈ ఫుడ్స్ తింటున్నారా? అయితే జాగ్రత్త అస్సలు మంచివి కావట
ఎర్లీ మార్నింగ్ ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నామనేది ఎంత ముఖ్యమో.. ఎలాంటి ఫుడ్‌కి దూరంగా ఉండాలో తెలుసుకోవడం కూడా ముఖ్యమంటున్నారు నిపుణులు. అవేంటంటే..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఉదయాన్నే కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే ఈ హ్యాబిట్ అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇది శరీరంలో ఆమ్లాలను పెంచి ఇబ్బందులకు గురి చేస్తుంది.
స్పైసీ ఫుడ్స్ ఆరోగ్యానికి మంచివి కాదని అందరికీ తెలుసు. కానీ ఉదయాన్నే ఇలాంటి ఫుడ్ తీసుకోవాలనుకుంటే జీర్ణ సమస్యలు పెరుగుతాయని చెప్తున్నారు.
సిట్రస్ ఫ్రూట్స్ ఖాళీ కడుపుతో తీసుకోకూడదని చెప్తున్నారు. ఇవి ఆరోగ్యానికి మంచివే అయినా.. ఉదయాన్నే తీసుకుంటే కడుపులో ఇరిటేషన్ కలుగుతుందని చెప్తున్నారు.
చక్కెర కలిగిన ఆహారం ఎక్కువగా తీసుకుంటే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదముంది. ఇది మిమ్మల్ని రోజంతా ఇబ్బందులకు గురిచేస్తుంది.
ప్రాసెస్ చేసిన ఫుడ్స్, పలు రకాల డ్రింక్స్‌కు వీలైనంత దూరంగా ఉండాలంటున్నారు. వీటిని ఉదయమే కాకుండా.. రోజులో ఏ సమయంలో అయినా తీసుకోకపోవడమే మంచిదంటున్నారు.
ఉదయాన్నే పాలు తాగే అలవాటు కొందరికి ఉంటుంది. కానీ కొందరికి పాలు పడవు కాబట్టి.. అలాంటివారు ఉదయాన్నే డెయిరీ ఫుడ్స్‌కి దూరంగా ఉంటే మంచిదంటున్నారు.