Thyroid Diet Restrictions : థైరాయిడ్ ఉంటే ఈ ఫుడ్స్ తినడం మానేయండి.. లేకపోతే డాక్టర్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది
సోయా ఉత్పత్తులు, సోయాతో చేసిన ఫుడ్స్, సోయా పాలు, టోఫు వంటివి థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. ఇందులో ఉండే సమ్మేళనాలు అయోడిన్ లోపాన్ని మరింత పెంచుతాయి. అందువల్ల థైరాయిడ్ ఉన్నవారు సోయాను మానేస్తే మంచిది.
థైరాయిడ్ ఉన్నవారు అధిక చక్కెర, స్వీట్స్ ఎక్కువగా తీసుకుంటే జీవక్రియ నెమ్మదిస్తుందట. అంతేకాకుండా బరువు పెరిగే సమస్య తీవ్రమవుతుంది. అందుకే చక్కెర, స్వీట్స్, జంక్ ఫుడ్లకు దూరంగా ఉండాలి.
ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన ఆహారం తీసుకుంటే వాటిలోని ప్రిజర్వేటివ్స్, సోడియం థైరాయిడ్‌ను దెబ్బతీస్తాయి. వీటిని తినడం వల్ల వాపు, హార్మోన్ల అసమతుల్యత మరింత పెరుగుతాయి.
క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ వంటివి థైరాయిడ్ హార్మోన్లను నిరోధిస్తాయి. ముఖ్యంగా వాటిని ఎక్కువ మొత్తంలో పచ్చిగా తింటే థైరాయిడ్ సమస్య మరింత పెరగవచ్చు.
టీ, కాఫీలలో ఉండే కెఫీన్ థైరాయిడ్ మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది గుండె వేగం, ఆందోళన సమస్యను పెంచుతుంది. అందువల్ల కెఫీన్ పరిమితం చేయాలని సూచిస్తున్నారు వైద్యులు.
థైరాయిడ్ రోగులు నూనె, డీప్ ఫ్రై చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఈ ఆహారాలు శరీరంలో కొవ్వును పెంచుతాయి. హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. దీనివల్ల బరువు పెరిగిపోతారు.
రెడ్ మీట్, ఎక్కువ కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులు డైట్ నుంచి తీసేస్తే మంచిది. వీటిలో ఉండే కొవ్వు థైరాయిడ్ హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ను కూడా పెంచుతుంది.