Richest Cities in the World : ప్రపంచంలో అత్యంత ధనిక నగరాలు ఇవే.. ఎటూ చూసినా మిలయనీర్లు, బిలియనీర్లే
నేటి ప్రపంచం వేగంగా మారుతోంది. సాంకేతికత, వ్యాపారం, దేశవిదేశాలతో అనుసంధానం వల్ల కొన్ని నగరాలు ధనవంతులకు అనుకూలంగా మారాయి. కోటీశ్వరులు, బిలియనీర్లు డబ్బు సంపాదించేందుకు అనువైనవిగా మారాయి. మంచి జీవనశైలితో పాటు సురక్షితమైన వాతావరణం ఇస్తోన్న నగరాలు ఏంటో చూసేద్దాం.
న్యూయార్క్ నగరం నేటికీ ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరంగా ఉంది. ఇక్కడ దాదాపు 3,84,500 మిలియనీర్లు, 818 మంది అత్యంత ధనవంతులు, 66 మంది బిలియనీర్లు ఉన్నారు. ఇక్కడ ఫైనాన్స్, ఫ్యాషన్, మీడియా, రియల్ ఎస్టేట్ వంటి అనేక రంగాలు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి.
అమెరికాలోని బే ఏరియా, సిలికాన్ వ్యాలీ, శాన్ ఫ్రాన్సిస్కో.. సాంకేతిక ప్రపంచానికి కేంద్రంగా మారాయి. ఇక్కడ దాదాపు 3,05,700 మంది మిలియనీర్లు నివసిస్తున్నారు. ఇక్కడ పెద్ద సాంకేతిక సంస్థలు, ఇన్నోవేషన్స్, స్టార్టప్ కల్చర్ ధనవంతులకు హాట్‌స్పాట్‌గా మారాయి.
జపాన్ రాజధాని టోక్యో సాంకేతికతలో మాత్రమే కాదు ఆసియాలోని అత్యంత ధనిక నగరాల్లో ఒకటిగా కూడా ఉంది. ఇక్కడ దాదాపు 2,98,300 మంది మిలియనీర్లు నివసిస్తున్నారు. ఇక్కడి ఆర్థిక స్థిరత్వం, వ్యాపార వాతావరణం, హైటెక్ జీవనశైలి ధనికులకు పరిపూర్ణ గమ్యస్థానంగా మారింది.
సింగపూర్‌లో కూడా ధనికులు ఎక్కువ. ఇక్కడ 2,44,800 మంది మిలియనీర్లు, 30 మంది బిలియనీర్లు ఉన్నారు. పన్ను మినహాయింపులు, సురక్షితమైన వాతావరణం, వ్యాపార అనుకూల విధానాలు ఈ దేశాన్ని రిచ్‌గా మార్చాయి. ఇప్పుడు సింగపూర్ ఆసియాలోనే కాకుండా అంతర్జాతీయ ధనికులకు కూడా కేంద్రంగా మారుతోంది.
లాస్ ఏంజిల్స్‌లో రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, మీడియా పరిశ్రమలు ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ 2,12,100 మిలియనీర్లు, 516 మంది సూపర్ రిచ్, 43 మంది బిలియనీర్లు ఉన్నారు.