Slow Down Digestion : జీర్ణక్రియను మందగించేలా చేసే అలవాట్లు ఇవే.. మార్చుకోకపోతే కడుపు సమస్యలు తప్పవు!
జంక్ ఫుడ్, వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఫుడ్ జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తుంది. కడుపు ఉబ్బరం లేదా మలబద్ధకం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది దీర్ఘకాలంలో తీవ్రమైన జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది.
రాత్రి పడుకునే ముందు తినడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఎసిడిటీ పెరుగుతుంది. నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. కడుపులో మంటను కలిగిస్తుంది.
నూనె, మసాలా దినుసులు ఎక్కువగా ఫుడ్ రూపంలో తీసుకుంటే కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం పెంచుతుంది. ఈ అలవాటును కొనసాగిస్తే జీర్ణవ్యవస్థ పూర్తిగా బలహీనపడుతుంది. ఇది కడుపు వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
డీహైడ్రేషన్ కారణంగా ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. రోజంతా తగినంత నీరు తాగకపోతే కడుపు ఉబ్బరం, అసౌకర్యంగా కనిపిస్తాయి.
అధిక ఒత్తిడి, ఆందోళన జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా కడుపు నొప్పి, ఆకలి తగ్గడం, గ్యాస్ వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి.
వ్యాయామం చేయకపోతే జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది బరువు పెరగడానికి మాత్రమే కాకుండా మలబద్ధకం, పొట్ట ఉబ్బరం సమస్యలను పెంచుతుంది.
మొబైల్ లేదా టీవీ చూస్తూ భోజనం చేయడం వల్ల ఏకాగ్రత ఉండదు. జీర్ణక్రియ సరిగ్గా ఉండదు. దీనివల్ల గ్యాస్, అజీర్ణం, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. వీటిని మార్చుకోకపోతే జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి.