Heart-Damaging Foods : గుండె ఆరోగ్యానికి ఈ 7 ఆహారాలు చాలా ప్రమాదకరమైనవి.. WHO ఇస్తోన్న అలర్ట్ ఇదే
డీప్ ఫ్రైడ్ ఫుడ్ గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు. పకోడా, సమోసా, ఫ్రైడ్ చికెన్లలో ట్రాన్స్ ఫ్యాట్, పదేపదే వేడి చేసిన నూనె ఉంటుంది. ఇది LDLను పెంచుతుంది. ఇన్ఫ్లమేషన్ పెరిగేలా చేసి.. నేరుగా ఫలకం ఏర్పడటానికి సహాయపడుతుంది. దీనివల్ల ధమనులు త్వరగా బ్లాక్ అయిపోతాయి.
ప్రాసెస్ చేసిన మాంసాన్ని కూడా గుండె ఆరోగ్యానికి ప్రమాదకరంగా భావిస్తారు. ఇందులో సాసేజ్, బేకన్, కొవ్వు, సోడియం ఉంటాయి. వీటిని రోజూ తక్కువగా తీసుకున్నా.. కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ధమనులను గట్టిపరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదం పెంచుతుంది.
వైట్ బ్రెడ్, పేస్ట్రీలు, మిఠాయిలు, చక్కెర పానీయాలు రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతాయి. దీని వలన ట్రైగ్లిజరైడ్లు పెరిగి.. ధమనుల చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. దీర్ఘకాలంలో ఇది మధుమేహం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
చిప్స్, బిస్కెట్లు, బేక్ చేసిన జంక్ ఫుడ్స్‌లలో హైడ్రోజనేటెడ్ ఆయిల్ ఉంటుంది. ఇవన్నీ చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. మంచి కొవ్వును తగ్గిస్తాయి. దీనివల్ల రక్త నాళాలు ఇరుకుగా మారతాయి.
ఇన్స్టంట్ నూడుల్స్, ప్యాక్ చేసిన సూప్, ఊరగాయలు, చిప్స్, రెస్టారెంట్ ఆహారాలలో సోడియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. ధమని గోడలకు నష్టం కలిగిస్తుంది. దీని వలన ఫలకం ఏర్పడుతుంది.
మటన్, బీఫ్, లాంబ్లలో సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్ అధికంగా ఉంటాయి. ఇది TMAOని పెంచుతుంది. ఫలకాలను ఏర్పరిచే ఒక సమ్మేళనం ఇది. నిపుణులు దీనిని అప్పుడప్పుడు మాత్రమే తినమని సలహా ఇస్తారు.
సోడా జీవక్రియను దెబ్బతీస్తుంది. కోరికలను పెంచుతుంది. ఎనర్జీ డ్రింక్స్ గుండె వేగం, రక్తపోటును పెంచుతాయి. కాలక్రమేణా గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి.