Best Remedies for Itching : దద్దుర్లను ఈ ఇంటి చిట్కాలతో దూరం చేసుకోండి.. దురద మాయమే ఇక
కలబందలో శోథ నిరోధక, చల్లబరిచే లక్షణాలు ఉంటాయి. ఇవి దురద, ఎరుపుదనం నుంచి తక్షణమే ఉపశమనం ఇస్తాయి. కాబట్టి తాజా కలబంద గుజ్జును నేరుగా రాష్పై రాయాలి. ఇది సహజ నివారణిగా పని చేసి.. ఇన్ఫెక్షన్లను నివారించడానికి సహాయపడుతుంది.
కొన్ని మంచు ముక్కలను శుభ్రమైన క్లాత్‌లో చుట్టాలి. దీనిని దద్దుర్లపై ఉంచాలి. ఇది వాపును తగ్గించడానికి, చర్మాన్ని తిమ్మెర చేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల మంట లేదా దురద నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఓట్మీల్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఓట్స్ వేసి 15-20 నిమిషాలు నానబెట్టాలి. ఈ ఇంటి నివారణ దద్దుర్లు, ఎగ్జిమా, అలెర్జీ ప్రతిచర్యలను తగ్గిస్తుంది.
కొబ్బరి నూనెలో లారిక్ ఆమ్లం సమృద్ధిగా ఉంటుంది. ఇది పొడి, చికాకు కలిగించే చర్మానికి తేమను అందిస్తుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే దద్దుర్లను దూరం చేస్తుంది. రోజుకు రెండుసార్లు నేరుగా చర్మంపై రాయాలి.
కంప్రెస్ చేసిన చామంతి టీ బ్యాగ్లను మరిగించి.. చల్లారక ప్రభావిత ప్రాంతంలో నేరుగా అప్లై చేయాలి. చామంతి చికాకు కలిగించే చర్మాన్ని శాంతపరచడానికి, ఎరుపును తగ్గించడానికి, ఓదార్పునివ్వడానికి హెల్ప్ చేస్తుంది.
యాపిల్ సైడర్ వెనిగర్‌ను నీటితో డైల్యూట్ చేసి.. దూది సహాయంతో చర్మంపై చికాకు ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. దీనిలోని యాంటీమైక్రోబియల్ లక్షణాలు.. ఫంగల్ రాష్ వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.
నీటిలో బేకింగ్ సోడాను వేసి కలిపి పేస్ట్ చేయాలి. దురద నుంచి ఉపశమనం కోసం ఈ పేస్ట్‌ను దద్దుర్లు మీద 10-15 నిమిషాలు ఉంచి తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇది దద్దుర్లను, వాపును తగ్గించి దురదను దూరం చేస్తుంది.
వేపాకులను నీటిలో మరిగించి చల్లార్చాలి. ప్రభావిత ప్రాంతాన్ని కడగడానికి ఈ నీటిని ఉపయోగించాలి. అనంతరం మీరు ఆకులను రుబ్బి మీ దద్దుర్లపై అప్లై చేసుకోవచ్చు. వేపలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు దద్దుర్లను తగ్గిస్తాయి.