Pre Pregnancy Tests : ప్రెగ్నెన్సీకి ట్రై చేసే ముందు చేయించుకోవాల్సిన మెడికల్ టెస్ట్లు ఇవే
ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకునే ముందు కొన్ని మెడికల్ టెస్ట్లు చేయించుకుంటే పుట్టబోయే బిడ్డకి, తల్లికి ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరుబెల్లా టెస్ట్ చేయించుకోవాలి. ఇది ఎక్కువగా పిల్లలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి గర్భధారణ సమయంలో సోకినట్లయితే తీవ్రమైన పరిస్థితులకు కారణం కావచ్చు. దీనివల్ల బిడ్డకు ప్రాణాంతకం కావచ్చు.
హెచ్ఐవీ టెస్ట్ పేరెంట్స్ ఇద్దరూ చేయించుకోవాలి. ఒకవేళ మీకు హెచ్ఐవీ ఉంటే.. అది పిల్లలకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. వైద్యులు సూచనలు ఫాలో అవ్వాలి.
హెపటైటిస్ బి అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఇది లివర్ హెల్త్‌ని ప్రభావితం చేస్తుంది. క్యాన్సర్‌ని ప్రమోట్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకమవుతుంది కాబట్టి కచ్చితంగా ఈ టెస్ట్‌ని ప్రెగ్నెన్సీకి ముందు చేయించుకోవాలి.
థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. దానికి తగిన మెడిసిన్, వైద్యులు సూచనల మేరకు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవచ్చు.
కంప్లీట్ బ్లెడ్ చేయించుకోవాలి. ఎనిమీయా ఉంటే ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే బ్లెడ్ లేకుంటే బేబి ఎదుగుదలలో గ్రోత్ ఉండదు.
ఇవే కాకుండా.. జెనిటిక్స్, బీపీ, షుగర్ వంటి మరికొన్ని టెస్ట్‌లను వైద్యులు సజెస్ట్ చేస్తారు. అవన్నీ కచ్చితంగా చేయించుకుంటే బేబి హెల్తీగా ఉంటుంది. అంతేకాకుండా తల్లీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.