Cancer Prevention Routine : రోజూ ఈ పని చేస్తే 13 రకాల క్యాన్సర్లు దూరం అవుతాయట.. న్యూ స్టడీలో షాకింగ్ విషయాలు
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక పరిశోధన ప్రకారం.. రోజూ నడిస్తూ ఉంటే.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం కొంత వరకు తగ్గుతుందని తెలిపారు. దీనికి సంబంధించి కొందరి కార్యకలాపాలను ట్రాక్ చేశారు. ఎంత ఎక్కువ నడిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం అంత తక్కువగా ఉంటుందని కనుగొన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనడవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని ఇప్పుడు అనేక పరిశోధనల్లో వెలుగులోకి వచ్చింది. మీరు ఎంత ఎక్కువగా నడుస్తారో.. అంత సురక్షితంగా ఉంటారని నిపుణులు చెప్తున్నారు.
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం 85,000 మంది యువకులను దీనిలో భాగస్వామ్యం చేసింది. వారంతా accelerometers పెట్టుకున్నారు. 6 సంవత్సరాల పాటు పర్యవేక్షించారు.
ఈ అధ్యయనంలో 2,600 మందిలో 13 మందికి కనీసం ఒక క్యాన్సర్ ఉందని గుర్తించారు. వీరిని కూడా అధ్యయనంలో చేర్చారు. అయితే వారి నడక ప్రారంభించినప్పుడు వారిలో చాలా తేడా కనిపించింది.
ఈ సమయంలో ప్రతిరోజూ 7 వేల అడుగులు నడిచే వారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం 11 శాతం తగ్గిందట. అదే సమయంలో 9 వేల అడుగులు నడిచే వారిలో ఈ శాతం 16కి చేరుకున్నట్లు గుర్తించారు.
అయితే ఈ సమయంలో ఎంత వేగం ఉంటుందని అనుకున్నారో.. అంత వేగం ఈ మొత్తం అధ్యయనం సమయంలో కనిపించలేదట. ఎక్కువ వేగంతో నడవడం వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. కానీ మొత్తం అడుగులు మాత్రమే ఈ రకమైన సమస్యలను తగ్గిస్తాయని గుర్తించారు.
ఆ జాబితాలో ఉన్న 13 క్యాన్సర్ల గురించి మాట్లాడితే.. వాటిలో మూత్రాశయం, రొమ్ము, పెద్దపేగు, ఎండోమెట్రియల్, అన్నవాహిక, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, కడుపు, పురీషనాళ క్యాన్సర్లు ఉన్నాయి. అలాగే లుకేమియా, మైలోమా, తల, మెడ క్యాన్సర్లు కూడా ఉన్నాయి.