Cucumber Benefits : వేసవిలో కీరదోసకాయలు రోజూ తింటే కలిగే లాభాలివే.. ఆ సమస్యలు దూరం
సమ్మర్లో వేడిని కంట్రోల్ చేయడానికి.. వివిధ ఆరోగ్య సమస్యల్ని దూరం చేసుకోవడానికి కొన్ని ఫుడ్స్, డ్రింక్స్ డైట్లో చేర్చుకోవాలి. వాటిలో కీరదోస కూడా ఒకటి.
కీరదోసను సూపర్ ఫుడ్‌గా చెప్పొచ్చు. ముఖ్యంగా సమ్మర్లో ఇది తీసుకుంటే చాలా మంచిది. దీనిలో 96 శాతం నీరు ఉంటుంది. ఇది డీహైడ్రేషన్ సమస్యను దూరం చేస్తుంది.
కీరదోసకు శరీరాన్ని సహజంగా చల్లార్చే లక్షణాలు ఉంటాయి. వేసవిలో ఇది శరీరాన్ని లోపలి నుంచి కూల్‌గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది.
విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. అంతే కాకుండా స్కిన్ హెల్త్‌ని మెరుగుపరుస్తాయి. సమ్మర్లో వచ్చే స్కిన్ సమస్యల్ని దూరం చేసుకోవచ్చు.
కీరదోసలోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని సహజంగా డీటాక్స్ చేస్తాయి. ఇది పూర్తి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
కీరదోసలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది వేసవిలో ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. కాబట్టి మీ డైలీ రొటీన్లో ఫైబర్ కోసం దీనిని తీసుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.