MBBS Abroad : MBBS చదవడానికి చవకైన దేశాలు.. తక్కువ ఖర్చులో మంచి వైద్య విద్య అందిస్తాయి

ఎంబీబీఎస్ తక్కువ ఖర్చుతో చదవాలంటే ఈ దేశాలు బెస్ట్
MBBS చదవాలి అనుకుంటే.. ప్రపంచంలోనే అత్యంత చవకైన దేశాలలో బెలారస్ ఒకటి. ఇక్కడ జీవన వ్యయం నెలకు 15 నుంచి 20 వేల రూపాయలు మాత్రమే ఉంటుంది. మొత్తం చదువుకు అయ్యే ఖర్చు సుమారు 26 నుంచి 28 లక్షల రూపాయలు ఉంటుంది. ఇక్కడి డిగ్రీ WHO, NMC లచే గుర్తింపు పొందింది. చదువు కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.
బెలార్స్ తర్వాత కజకిస్తాన్ MBBSకు బెస్ట్ ఆప్షన్. అయితే ఇక్కడ MBBS 5 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ చదవాలంటే ఇంటర్లో కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. చదువు పూర్తయిన తర్వాత ఇండియన్ స్టూడెంట్స్ FMGE పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. అప్పుడే వారు ఇండియాలో ప్రాక్టీస్ చేయగలుగుతారు. ఇక్కడ మొత్తం ఖర్చు సుమారు 25 నుంచి 26 లక్షల రూపాయలు ఉంటుంది.
రష్యాలో MBBS చదువుకోవడం.. భారతీయ విద్యార్థులకు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇక్కడ MBBS కోర్సు ఆరు సంవత్సరాలు ఉంటుంది. రష్యాలో చాలా పురాతన విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇవి ఇంగ్లీష్ మాధ్యమంలో MBBS బోధిస్తాయి. చదువు పూర్తయిన తర్వాత విద్యార్థులు భారతదేశంలో ఇంటర్న్‌షిప్ చేయాలి. ఇక్కడ MBBS చదువు మొత్తం ఖర్చు దాదాపు 29 నుంచి 30 లక్షల ఖర్చు అవుతుంది.
ఫిలిప్పీన్స్‌లో కూడా తక్కువ ఖర్చుతో MBBS చదువుకోవచ్చు. ఫిలిప్పీన్స్‌లో వైద్య విద్య క్లినికల్ సబ్జెక్ట్స్, క్లిష్టమైన శిక్షణపై దృష్టి పెడతారు. ఇక్కడ విద్యార్థులకు సీనియర్ డాక్టర్లతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది. అలాగే చదువుకు అయ్యే ఖర్చు కూడా 20 నుంచి 22 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇక్కడ లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
చైనాలో MBBS కోర్సు వ్యవధి ఆరు సంవత్సరాలు. ఇందులో 5 సంవత్సరాలు చదువు, 1 సంవత్సరం ఇంటర్న్‌షిప్ ఉంటాయి. ఇక్కడ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. దీనివల్ల చదువు మరింత చౌకగా అవుతుంది. ఇక్కడ ప్రవేశం కోసం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో 50 శాతం మార్కులు తప్పనిసరి ఉండాలి. ఇక్కడ మొత్తం ఖర్చు దాదాపు 29 నుంచి 30 లక్షల రూపాయలు అవుతుంది. ఇంటర్న్‌షిప్ భారతదేశంలో కూడా చెల్లుబాటు అవుతుంది.
రష్యా, చైనా, ఫిలిప్పీన్స్, బెలారస్, కజకిస్తాన్‌తో పాటు భారతీయ విద్యార్థులు జార్జియా, ఉజ్బెకిస్తాన్, జర్మనీ, పోలాండ్ వంటి దేశాలలో కూడా MBBS చదువుకోవచ్చు. ఈ దేశాలన్నీ చవకైన వైద్య విద్యతో పాటు మంచి క్లినికల్ ఎక్స్‌పోజర్‌ని కూడా అందిస్తాయి.