Expensive Internet Countries : ఈ ఐదు దేశాలలో ఇంటర్నెట్ బాగా ఖరీదైనదట.. ఇండియా ఆ లిస్ట్‌లో ఉందా? పాకిస్తాన్ పరిస్థితి ఏంటి?
2025లో ఇంటర్నెట్‌ని ఎక్కువ ధరకి ఇస్తోన్న దేశంగా UAE నిలిచింది. ఇక్కడ యూజర్ ప్రతి Mbpsకి $4.31 ఖర్చు పెడతారట. అంటే హై స్పీడ్ డేటా ప్లాన్ కావాలి అంటే.. దాని ఖర్చు ఇతర దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువ అట.
ఆఫ్రికా దేశంలో ప్రజలు ఇంటర్నెట్ ప్రతి Mbps కోసం $2.58 చెల్లించాల్సి ఉంది. మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడం, పరిమిత సేవల వల్ల ఇక్కడ ఇంటర్నెట్ ఖర్చు నిరంతరం పెరుగుతోంది.
యూరప్‌లోని స్విట్జర్లాండ్ దేశం సాంకేతికత, ఆవిష్కరణలలో ముందున్నా.. ఇంటర్నెట్ విషయంలో ఇది చాలా ఎక్కువ ఖర్చు చేస్తుంది. స్విట్జర్లాండ్‌లో ఇంటర్నెట్ ప్రతి Mbpsకి $2.07. ఇది ప్రపంచంలోనే మూడవ అత్యంత ఖరీదైన దేశంగా నిలిచింది.
ఆఫ్రికాలోని మరో దేశం కెన్యా నాల్గవ స్థానంలో ఉంది. ఇక్కడ ఇంటర్నెట్ వినియోగదారులు ప్రతి Mbpsకి $1.54 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం డిజిటల్ మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తున్నప్పటికీ.. ఇక్కడ డేటా ఖరీదైనది. పరిమితంగా ఉంది.
మొరాకోలో ఇంటర్నెట్ సగటు ధర ప్రతి Mbpsకి $1.16. ఈ దేశంలో ఇంటర్నెట్ సౌకర్యం వేగంగా పెరుగుతున్నప్పటికీ.. ధరలు ఇప్పటికీ సాధారణ వినియోగదారులకు అందుబాటులో లేవు.
పాకిస్తాన్ ఈ జాబితాలో పదవ స్థానంలో ఉంది. అక్కడ ఇంటర్నెట్ సగటు ధర ప్రతి Mbpsకి $0.53 చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక సంక్షోభం, పరిమిత నెట్‌వర్క్ కవరేజ్ కారణంగా ఇంటర్నెట్ సేవలు ఖరీదైనవిగా ఉన్నాయి.
ప్రపంచంలోని ఈ ఖరీదైన దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఇంటర్నెట్ చాలా చౌకగా ఉంది. ఇక్కడ వినియోగదారులకు సగటున ప్రతి Mbpsకి $0.08 చొప్పున డేటా లభిస్తుంది. ఈ విషయంలో భారత్ ప్రపంచంలో 41వ స్థానంలో ఉంది. అయితే ఇది ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇంటర్నెట్ కలిగిన దేశాలలో ఒకటిగా పరిగణించబడింది. భారతదేశంలో 900 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. జియో, ఎయిర్టెల్ వంటి టెలికాం ఆపరేటర్లు పోటీ పడి డేటా ధరలను బాగా తగ్గించారు. దీని కారణంగా భారతదేశంలో డిజిటల్ విప్లవం వేగంగా పెరుగుతోంది. ప్రతి వర్గానికి చెందిన ప్రజలకు ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తోంది.