Beer for Kidney Stones : బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?

బీర్ తాగితే కిడ్నీలో రాళ్ల తగ్గుతాయా?
బీర్ తాగితే కిడ్నీ స్టోన్స్ బయటకు వస్తాయని చాలామంది నమ్ముతారు. కానీ దీనికి పూర్తి స్థాయిలో శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెప్తున్నారు.
కొన్ని అధ్యయనాల ప్రకారం బీర్‌లో ఉండే ద్రవ పరిమాణం మూత్ర విసర్జనను పెంచవచ్చు. దీంతో చిన్న స్టోన్స్ బయటకు వెళ్లే అవకాశం కొంత ఉండొచ్చు.
అయితే బీర్‌లో ఆల్కహాల్ ఉండటం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. డీహైడ్రేషన్ కిడ్నీ స్టోన్స్ సమస్యను మరింత పెంచొచ్చు.
హార్వర్డ్‌కు చెందిన కొన్ని పరిశోధనల్లో పరిమిత మోతాదులో బీర్ తీసుకునేవారిలో కిడ్నీ స్టోన్స్ ప్రమాదం కొంత తక్కువగా కనిపించినా.. దీనిని చికిత్సగా భావించకూడదని వైద్యులు చెబుతున్నారు.
బీర్ తాగడం వల్ల స్టోన్స్ కరిగిపోతాయని లేదా పూర్తిగా పోతాయని చెప్పే బలమైన మెడికల్ ఎవిడెన్స్ ప్రస్తుతం లేదని చెప్తున్నారు నిపుణులు.
ఇప్పటికే కిడ్నీ వ్యాధులు, లివర్ సమస్యలు, హై బీపీ, డయాబెటిస్ ఉన్నవారు బీర్‌ను హెల్త్ డ్రింక్‌లా తీసుకోవడం ప్రమాదకరం కావొచ్చు.
కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండాలంటే బీర్ కంటే తగినంత నీరు తాగడం, ఉప్పు తగ్గించడం, ఆక్సలేట్ ఎక్కువగా ఉన్న ఆహారాలను నియంత్రించడం, వైద్యుల సూచనలు పాటించడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.