Pre Diabetic Care : ప్రీ-డయాబెటిస్, మధుమేహం ఉన్నవారు తినకూడని పండ్లు ఇవే.. షుగర్ పెరగవచ్చు జాగ్రత్త

ప్రీ డయాబెటిస్ ఉన్నవారు తినకూడని పండ్లు ఇవే
మామిడి పండ్లు రుచిగా ఉండటంతో చాలామంది ఎక్కువగా తింటారు. కానీ వీటిలో సహజ చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పండిన మామిడిలో గ్లైసెమిక్ లోడ్ ఎక్కువగా ఉండొచ్చు. డయాబెటిస్ ఉన్నవారు పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న పరిమాణంలో మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ద్రాక్షలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. చిన్న పరిమాణంలో తీసుకున్నా ఎక్కువ చక్కెర శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్ రెండింటినీ పరిమితంగా తీసుకోవడం మంచిది.
సపోటా చాలా తీపిగా ఉండే పండు. ఇందులో కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్లు దీనిని ఎక్కువగా తినకూడదని వైద్యులు చెబుతున్నారు.
అరటిపండ్లు శక్తిని ఇస్తాయి. కానీ పూర్తిగా పండిన అరటిపండ్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పెద్ద అరటిపండ్లు ఎక్కువగా తింటే బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది.
పుచ్చకాయలో నీరు ఎక్కువగా ఉన్నా.. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది రక్తంలో చక్కెరను వేగంగా పెంచవచ్చు. కాబట్టి పెద్ద బౌల్స్‌గా కాకుండా పరిమితంగా తీసుకోవడం మంచిది.
పండ్లకంటే ఫ్రూట్ జ్యూసులు మరింత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఫైబర్ తగ్గిపోవడంతో చక్కెర వేగంగా రక్తంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్యాక్డ్ జ్యూసులు, అదనపు చక్కెర కలిపిన జ్యూసులు తప్పించుకోవాలి.
డయాబెటిస్ ఉన్నవారు పండ్లు పూర్తిగా మానేయాలని అనుకోవడం తప్పు. పరిమిత మోతాదులో, సరైన టైమ్‌లో, డాక్టర్ లేదా డైటీషియన్ సూచనల ప్రకారం తీసుకుంటే చాలా పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పోర్షన్ కంట్రోల్ చాలా ముఖ్యం.