Vaginal Health : యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్ ఇవే.. మహిళలు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది

యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్
పెరుగు లేదా ప్రోబయోటిక్స్ తీసుకోవచ్చు. ఇవి మంచి బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడతాయి. దీంతో వెజైనల్ pH బ్యాలెన్స్ మెరుగుపడి ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది.
కేవలం నీళ్లు తీసుకుని శరీరం హైడ్రేటెడ్‌గా ఉంచితే వెజైనల్ టిష్యూల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. నీరు తక్కువగా తాగితే డ్రైనెస్ సమస్యలు పెరగొచ్చు.
షుగర్ లేకుండా క్రాన్‌బెర్రీ జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిది. యూరినరీ ట్రాక్ట్ ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. కొన్ని సందర్భాల్లో బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించడంలో ఇది సహాయపడుతుందని చెప్తున్నారు.
కొబ్బరి నీటిలో ఎలక్ట్రోలైట్స్ ఉండటం వల్ల శరీర హైడ్రేషన్‌కు సహాయపడుతుంది. వేసవిలో ఇది మంచి నేచురల్ డ్రింక్‌గా పనిచేస్తుంది.
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు కొన్ని ఇన్‌ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడొచ్చు.
అలోవెరా జ్యూస్ పరిమిత మోతాదులో తీసుకుంటే.. అలోవెరా జ్యూస్ జీర్ణక్రియ, హైడ్రేషన్‌కు మేలు చేయొచ్చు. అయితే ఎక్కువగా తీసుకుంటే విరేచనాలు రావచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం.
విటమిన్ C అధికంగా ఉన్న ఆరెంజ్, దానిమ్మ వంటి ఫ్రూట్ జ్యూసులు రోగనిరోధక శక్తికి మేలు చేస్తాయి. అధిక షుగర్ ఉన్న డ్రింక్స్ తగ్గించడం కూడా వెజైనల్ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
వెజైనల్ హెల్త్ అనేది కేవలం డ్రింక్స్ వల్ల పూర్తిగా బాగుంటుందని చెప్పలేము. హార్మోన్స్, హైజీన్, సెక్సువల్ హెల్త్, డయాబెటిస్, యాంటీబయోటిక్స్ వాడకం వంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి.