Ear Wax Cleaning : చెవులను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా శుభ్రం చేసుకోండి.. సింపుల్ హోమ్ టిప్స్ ఇవే
గోరువెచ్చని నీరు చెవిలోని మురికిని తొలగించడంలో సహాయం చేస్తుంది. డ్రాపర్ సహాయంతో కొన్ని చుక్కలు వేడి నీటిని చెవిలో వేయండి. కొంత సమయం తరువాత తలను వంచి నీటిని బయటకు పంపేయాలి. ఈ పద్ధతి చెవులను శుభ్రం చేయడానికి చాలా సులభమైనది. సురక్షితమైనది కూడా.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకొబ్బరి నూనె కూడా చెవి లోపల పేరుకుపోయిన పొడి మైనాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు 2-3 చుక్కలు వేసి.. మరుసటి రోజు ఉదయం తేలికగా శుభ్రం చేసుకోవచ్చు.
హైడ్రోజన్ పెరాక్సైడ్, నీటిని సమాన మోతాదులో కలిపి చెవిలో వేయాలి. ఇది చెవిలోని మురికిని నురుగుగా చేసి సులభంగా తొలగిస్తుంది. కానీ ఈ చిట్కాను వారానికి ఒకసారి మాత్రమే వాడండి.
టీస్పూన్ బేకింగ్ సోడాను 2 టీస్పూన్ల నీటిలో కలిపి చెవిలో 2-3 చుక్కలు వేయాలి. 10 నిమిషాల తర్వాత తల వంచి చెవిని శుభ్రం చేయండి. ఈ పద్ధతి మొండి మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది.
నీటిలో ఉప్పు కలిపి తయారు చేసిన ద్రావణం చెవులను శుభ్రం చేయడానికి ప్రభావవంతంగా హెల్ప్ చేస్తుంది. కాటన్ను ఈ ద్రావణంలో ముంచి.. చెవి లోపల కొన్ని చుక్కలు వేసి.. కొంత సమయం తర్వాత తల వంచండి.
వేడి నీటి ఆవిరి పీల్చుకోవడం వల్ల కూడా చెవి లోపల పేరుకుపోయిన మురికి, మలినాలు మెత్తబడి బయటకు వస్తాయి. ముఖ్యంగా చలికాలంలో ఈ చికిత్స చాలా ఉపశమనం కలిగిస్తుంది.