Tips to Patch Up with Your Best Friend : బెస్ట్ ఫ్రెండ్‌తో గొడవ అయితే.. ఇలా వారితో ఇలా రీ కనెక్ట్ అయిపోండి
ప్రతి స్నేహంలో నవ్వులు, ఆటలు, పాటలతో పాటు.. పోట్లాటలు కూడా ఉంటాయి. కానీ ఈ గొడవలు ఎప్పుడు పెద్దవిగా మారతాయో తెలియదు.
మీ బెస్ట్ ఫ్రెండ్ కూడా మీతో కోపంగా ఉంటే.. మీరు అతన్ని లేదా ఆమెను బుజ్జగించాలనుకుంటే ఈ ఫ్రెండ్షిప్ డే రోజు ఈ చిట్కాలను ఫాలో అయిపోండి.
మీరు మునుపటి సంబంధాన్ని వారితో కోరుకుంటే.. తప్పు చేయకపోయినా మీ స్నేహితుడిని మైత్రి కోసం మీరే సారీ అడిగేయండి. అక్కడితో ఆ సమస్య ముగిసిపోవచ్చు.
మీరు మీ స్నేహితుడికి సోషల్ మీడియా ద్వారా మెసేజ్ చేయండి. లేదా కాల్ చేసి మాట్లాడండి. వారు ఫోన్ ఎత్తకపోతే.. మీరు వారి ఇంటికి కూడా వెళ్లవచ్చు.
మీ స్నేహితుడికి బాగా నచ్చిన వస్తువును మీరు బహుమతిగా ఇవ్వవచ్చు. ఇది మీ స్నేహితుడి కోపాన్ని తగ్గిస్తుంది.
ఈ చిట్కాలన్నీ పాటించిన తర్వాత కూడా మీ స్నేహితుడు మీపై ఇంకా కోపంగా ఉంటే.. మ్యూచవల్ ఫ్రెండ్ సాయం తీసుకోండి. వారిని కూడా మీ గొడవలోకి రప్పించి.. వారి సహాయంతో సమస్య ఏంటో తెలుసుకోండి. దానిని దూరం చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి.