Beer Brewing : బీర్లో షుగర్ కలిపితే వచ్చే తేడా ఇదే.. అసలు ఎందుకు కలుపుతారో తెలుసా?
ముందుగా బీరు ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలి. బార్లీని నీటిలో నానబెట్టి మొలకెత్తించి మాల్ట్ తయారు చేస్తారు. అందులో సహజ చక్కెర ఉంటుంది. ఈ చక్కెరను కిణ్వ ప్రక్రియ సమయంలో ఈస్ట్ సహాయంతో కలిపి ఆల్కహాల్, కార్బన్ డయాక్సైడ్‌గా మారుతుంది.
ఈ ప్రక్రియ వల్ల బీరుకు రుచితో పాటు తేలికపాటి నురుగును ఇస్తుంది. అయితే చాలాసార్లు బ్రూవరీలు బీర్లలో అదనపు చక్కెరను కలుపుతాయి. దీనివల్ల ఆల్కహాల్ స్థాయితో పాటు, రుచిని పెరుగుతుందట.
అంతేకాకుండా పంచదార కలపడానికి చాలా కారణాలు ఉన్నాయి. బీర్లో కలపడానికి అతి పెద్ద కారణం ఆల్కహాల్ కంటెంట్ పెంచుకోవడమే. సాధారణ మాల్ట్ తగినంత చక్కెరను ఇవ్వనప్పుడు కూడా అదనపు చక్కెరను కలిపి ఈస్ట్‌కి ఆహారంగా అందిస్తారు.
ఇది ఆల్కహాల్ పరిమాణాన్ని పెంచుతుంది. బీరు ప్రభావాన్ని కూడా మరింత బలపరుస్తుంది. రుచి, రంగును బ్యాలెన్స్ చేస్తుంది. బెల్జియన్ ఏల్ లేదా లైట్ లాగర్ వంటి కొన్ని బీరు తయారీలో పానీయాన్ని మరింత మృదువుగా, పొడిగా మార్చడానికి షుగర్‌ను ఉపయోగిస్తారు.
అదనంగా చక్కెర బీరును లైట్ చేయడానికి సహాయపడుతుంది. మాల్ట్‌తో తయారు చేసిన బీరు కొన్నిసార్లు భారీగా, తీపిగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో బ్రూవర్స్ చక్కెరను వేసి దానిని బ్యాలెన్స్ చేస్తారు. ఇది మరింత క్రిస్ప్‌గా, మంచి రుచిని ఇస్తుంది.
అందుకే ఆసియా, లాటిన్ అమెరికాలోని అనేక దేశాలలో తయారు చేసిన బీరులో చక్కెర కలపడం సర్వసాధారణం. అయితే ఎక్కువ చక్కెర కలిపితే బీరు రుచి కృత్రిమంగా లేదా తీపిగా అనిపించవచ్చు. అందుకే ప్రీమియం బ్రూవరీలు, క్రాఫ్ట్ బీరు తయారీదారులు సహజమైన మాల్ట్ పైనే దృష్టి పెడతారు. అదనపు చక్కెర వాడకాన్ని తగ్గిస్తారు.
అలాగే చక్కెర కలపడం వల్ల పులియబెట్టే ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఆల్కహాల్ స్థాయి పెరగుతుంది. అలాగే బీరు టేస్ట్, తేలిక, ఆకృతిలో మార్పు వస్తుంది.